పాత్రికేయుల సేవలు అమూల్యం…!

కరోనా సంక్షోభం నుంచి పాత్రికేయులను కాపాడుకోవాలి

పలువురికి సరుకులు అందించిన టిఆర్ఎస్ యూత్ నాయకులు డాక్టర్ బొల్లికొండ వీరేందర్

కరోనా వైరస్ యావత్తు మానవాళిని గడగడలాడిస్తున్న నేపథ్యంలో పాత్రికేయుల సేవలు అమూల్యమైనవని టిఆర్ఎస యూత్ నాయకులు డాక్టర్ బొల్లికొండ వీరేందర్ అన్నారు. బుధవారం హన్మకొండ జడ్పీ గెస్ట్ హౌజ్ ఆవరణలోలో వరంగల్ నగరంలోని పలువురు పాత్రికేయులకు సరుకులు అందించారు.

ఈ సందర్భంగా వీరేందర్ మాట్లాడుతూ…కరోనా ప్రపంచాన్ని కుదిపేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ఆపత్కాల సమయంలో మీడియా రంగంలో పని చేస్తున్న ఫ్రంట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులను ఆర్థిక సంక్షోభం వెంటాడుతుందని అన్నారు. తమ వంతుగా 20 మంది చిన్న పత్రికలలో పనిచేస్తున్న పాత్రికేయులకు భరోసానివ్వటంలో భాగంగా పలువురికి
నిత్యవసర సరుకులు అందించటం జరిగిందని అన్నారు. కరోనా భారిన పడకుండా అనునిత్యం ప్రజలను అప్రమత్తం చేయటంలో మీడియా పాత్ర వెలకట్టలేనిదని అన్నారు.

ఈ సంక్షోభ సమయంలోనూ ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా నిలుస్తూ ప్రపంచవ్యాప్తంగా కరోనా ప్రభావ సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రజలకు అందిస్తున్న పాత్రికేయులను ఆర్థిక సంక్షోభం నుంచి కాపాడుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ పంపిణీ కార్యక్రమంలో
వరంగల్ అర్బన్ జిల్లా టియూడబ్ల్యూజె (H-143)ప్రధాన కార్యదర్శి నాయకపు సుభాష్ , ఓటుకూరి సాయిరాం,
అంతడుపుల శ్రీనివాస్, తిప్పిరిశెట్టి శ్రీనివాస్, బుర్ర శ్రీనివాస్, బానోత్ వెంకన్న, మాడ నర్సయ్య, దామెర రాజేందర్, కే. వెంకట్, తదితర జర్నలిస్టులు పాల్గొన్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *