తొలి అడుగైనా, మలి అడుగైనా… ఎప్పుడైనా ఎన్నికలతోనే సమాధానం

ఉద్యమానికి ఎన్నికలు జోడిరచిన పోరాటం…

`ప్రపంచ చరిత్రలోనే తెలంగాణ ఉద్యమం ఒక అధ్యాయం..

` కేసిఆర్‌ నాయకత్వం చరిత్రకు సంకేతం.

  హైదరాబాద్‌,నేటిధాత్రి: 

ఎన్నికలంటే భయంలేదు. ఉద్యమమైనా, రాజకీయమైనా ఒక్కటే. ప్రత్యర్థులకు సమాధానం చెప్పాలంటే ఎన్నికలే వేధిక. విద్యార్థి రాజకీయాలు కూడా ప్రత్యక్ష్యంగా చూసిన ముఖ్యమంత్రి కేసిఆర్‌కు ఎన్నికలు కొత్తకాదు. విజయాలకు తిరుగులేదు. ఆ మూడక్షరాలే విజయతీరాలు. ఎప్పుడూ పంతమే. ప్రత్యర్థులను కట్టడి చేసే వ్యూహమే. ఒకనాడు ఆయన తెగువే ఆయన ఎమ్మెల్యే కావడానికి కారణమైంది. ఉద్దండైన మదన్‌మోహన్‌ మీదే ఆయన విజయం సాధించడమే ఆయన ఆత్మస్థైర్యానికి నిదర్శం. తెలుగుదేశంలో వున్న కాలంలో తనకంటూ ఓ ప్రత్యేకమైన, విలక్షణమైన వ్యక్తిత్వంతోనే ఆయన ముందుకుసాగారు. తెలుగుదేశంపార్టీలో కార్యకర్తలకు దిశానిర్థేశం చేసే పాత్రనే ఎక్కువ కాలం పోషించారు. దాంతో అనర్ఘలమైన వాగ్థాటితోపాటు, లోతుగా ఏ విషయాన్నైనా విశ్లేషించగల సామార్థ్యం ఆయన సొంతం. అదే తెలంగాణ ఉద్యమాన్ని ఆయన భుజాన వేసుకునేంత తెగునను కనబర్చింది. ఎండిన తెలంగాణ, గొస పడుతున్న తెలంగాణ, కన్నీటి చుక్కలు తప్ప, నీటి చుక్కలు ముద్దాడని తెలంగాణ పల్లెల పొలాలు బీడులై పల్లెర్లుతో కనిపిస్తుంటే ఆయన గుండె తరుక్కుపోయేది.

 పారే సెలయేరును చూస్తే కంట్లో కన్నీరు కనిపించేంది.

 ఆ నీటి జాడలు మా తెలంగాణ మాగాణాన్ని తడిచేయకుండా పారుతుంటే కేసిఆర్‌ హృదయం చలించిపోయేది. అందుకే ప్రయాణాలు చేస్తున్నప్పుడు ఎక్కడైనా నీటి జాడలు పరుగులు తీస్తుంటే, మా తెలంగాణ పొలాల్లో కూడా పారమ్మా అంటూ ఆ నీళ్లలో పైసలు వేస్తూ వెళ్లేవారట. నిజంగా ఒక ప్రాంతం మీద ఇంత మక్కువ వున్న నేతలు దేశ చరిత్రలోనే బహు అరుదు. తన రాజకీయాలు, తన అవసరాలు అనుకునే రాజకీయాలు చూస్తున్న ఈ రోజుల్లో కూడా తన నేల గురించి తపన పడే ఏకైక భూమి పుత్రుడుగా ఆయనను ఎంతో మంది కీర్తిస్తున్నారు. భూమి అన్నా, పంటలన్నా ఆయనకు ఎంతో ఇష్టం. పచ్చని పొలాలు చూస్తూ కాలం గడపం అంటే ఇష్టం. ఇష్టంగా సాగు చేయడం, కష్టంతో పండిన పంట అనుకున్నంత చేతికి రాకపోయినా, సాగును మానని సగటు ఆసామి కేసిఆర్‌. భారత దేశ వ్యవసాయమే ప్రకృతితో ఆడే జూదం లాంటిదని చదివే విద్యార్థులకు, వ్యవసాయం అంటే దండగ కాదు, పండగ అన్న స్థాయి తెలంగాణకు తీసుకురావాలన్న కసి నుంచి మొదలైన ఆలోచనే తెలంగాణ పోరాటం. 2000 మొదలైన మొదటి అడుగు, పారే నీటిని తెలంగాణకు మళ్లీంచే వరకు ఆగలేదు. తెలంగాణలో ఓ కాలేశ్వరం వస్తుందని ఎవరూ ఊహించలేదు. పల్లెలు వలస వెళ్తుంటే, గ్రామాలు ఖాళీ అవుతుంటే, బొంబాయి, బొగ్గుబాయి, అప్పులు చేసి దుబాయి వెళ్లే తెలంగాణ ప్రజలు మళ్లీ తెలంగాణలోనే వుండాలంటే, వారి జీవితాల్లో వెలుగులు నిండాలంటే, పల్లెలన్నీ పచ్చని రంగును పూసుకోవాలంటే, ప్రతి వ్యక్తి రైతుగా మారి, మళ్లీ తమ మాగాణంలో బంగారం పండిరచాలంటే తెలంగాణ రావాలి. నిధుల దోపిడి, నియామాల కట్టడి జరగాలి. తెలంగాణకు వచ్చే ప్రతి పైసా తెలంగాణకే ఖర్చు కావాలి. తెలంగాణలో పుట్టిన ప్రతి యువకుడికి తెలంగాణలోఉద్యోగం రావాలి. పరాయి పాలన పోవాలి. అని 2000 నాడు ఎమ్మెల్యే పదవిని వదిలి, తెలంగాణ రాష్ట్ర సమితికి 2001 ఎప్రిల్‌లో అంకుర్పాణ చేసి, కాలుకు బలపం కట్టుకొని ఆరోజే ఊరూరు తిరిగారు. ఆ సమయంలో వచ్చిన స్థానిక సంస్థల ఎన్నికలను ఉద్యమానికి మిలితం చేసి, తాను రాజీనామా చేసి, సిద్ధిపేట ఉప ఎన్నికలకు వెళ్లి బరిగీసి కేసిఆర్‌ నిలిచారు. ఎలాగైనా కేసిఆర్‌ను కట్టడి చేయాలని చాలా మంది చూశారు. కాని ఎవరి తరం కాలేదు. ఆయన ఉద్యమ ప్రస్థానంపై అనేక రాళ్లేశారు. తెలంగాణ తీసుకురాకపోతే తనను రాళ్లతో కొట్టండని కేసిఆర్‌ చెప్పారు. అనుకున్నట్లుగానే ఆయన తన ఉద్యమాన్ని రాజకీయాలకు మిలితం చేసి, కొత్త తరహా ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. ఇదే అప్పట్లో ఒక రకంగా సంచలనమే అయినా, ప్రత్యర్థి పార్టీలు పుబ్బలో పట్టి, మగలో మాయమౌతుందన్నారు. కాని అన్ని పార్టీలను మాయం చేసి, 2018లో తనకు ఎదరే లేదని నిరూపించారు. రెండోసారి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు తెలంగాణ అన్న పదాన్నే అసెంబ్లీలో నిషేధించారు. వెనుకబడిన ప్రాంతమన్నారు. కాని వెనుకబడేసిన ప్రాంతమంటూ గొంతెత్తిన కేసిఆర్‌, తన స్వీయ తెలంగాణ రాజకీయ అస్థిత్వానికి పునాలువేసి, తెలంగాణ కోసం ఎప్పుడంటే అప్పుడు ఎన్నికలకోసంవెళ్లారు. ప్రజల్లో రాజకీయ చైతన్యమే తెలంగాణ సాధనకు ఉపయోగపడుతుందని కేసిఆర్‌ బలంగా నమ్మారు. అయితే తెలంగాణ కోసం పార్టీలు పెట్టి, నట్టెట ముంచివారిని కళ్లతో చూసిన తెలంగాణ సమాజం కేసిఆర్‌ను పూర్తిగా నమ్మడానికి కూడా కొంత కాలమే పట్టిందని చెప్పాలి. 2004 ఎన్నికల్లో అప్పటికే తెలంగాణ తీర్మాణాన్ని డిల్లీకి పింపిన కాంగ్రెస్‌తో జతకూడి, తెలంగాణ సాధన సాగించే వ్యూహాన్ని నిర్మించారు. దాంతో తెలంగాణలో 54 సీట్లలో పోటీ చేసి, 26 సీట్లు సాధించారు. అయితే ఓ వైపు తెలంగాణ కోసం కేసిఆర్‌ ఎక్కే గడప, దిగే గడపలాగా సాగుతుంటే, కొంత మంది తమ స్వార్థం కోసం నమ్మి మంత్రి పదవులు కూడా అందేలా చేస్తే, ఉద్యమానికి ద్రోహం చేశారు. ఈ సమయంలో కాంగ్రెస్‌ మొదటికే మోసం చేసేలా వుందని గ్రహించిన కేసిఆర్‌, నాటి కాంగ్రెస్‌తో తెగదెంపులకే సిద్ధమయ్యారు. అంటే ఆయన తెలంగాణకోసం ఎంత అంకితభావంతో వున్నారో అర్థం చేసుకోవచ్చు. ఇదే సమయంలో నాటిమంత్రి, సీనియర్‌ కాంగ్రెస్‌నాయకుడు ఎం. సత్యనారాయణ విసిరిన సవాలను స్వీకరించి, కరీంనగర్‌నుంచి లోక్‌సభకు ఎన్నికైనా కేసిఆర్‌ రాజీనామా చేశారు. మళ్లీ ఎన్నికల్లో వెళ్లారు. ఆయనను ఓడిరచేందకు సమైక్యరాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌, మంత్రులందరినీ రంగంలోకి దింపినా, రెండు లక్షల మెజార్టీతో గెలిచి, కేసిఆర్‌ నిలిచారు. తెలంగాణ ప్రజల్లో వున్న ఆత్మవిశ్వాసాన్ని ఆయన గుండె నిండా నింపుకొని, పదహారు మంది ఎమ్మెల్యేలతో ఆయన రాజీనామాలు చేయించి, ఒంటరిపోరుకు సిద్ధమయ్యారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలబెట్టారు. అయితే నాడు వచ్చిన ప్రజాతీర్పుతో కొంత ఇబ్బందిపడ్డ కేసిఆర్‌, ఏ ఉద్యమైనా, రాజకీయామైనా, ఎత్తుపల్లాలు సహజమే. మన అంకితభావాన్ని మరింత నింపుకొని ముందుకుసాగాలని నిర్ణయించుకొని, ఒక అడుగు వెనక పడ్డంత మాత్రాన మడమ తిప్పనిన మరోసారి బరిగీసి నిలిచారు. అయితే తర్వాత వచ్చిన సార్వత్రిక ఎన్నికల్లో మహాకూటమి ఏర్పాటుతో ఆయన తెలంగాణ అస్థిత్వాన్ని కాపాడుతూనే వచ్చారు. 2009లో ఆయన ఇక కేసిఆర్‌ చచ్చుడా, తెలంగాణ వచ్చుడా అన్నంత నిర్ణయం తీసుకున్నారు. ఆమరణ నిరసనకు దిగారు. 2009 డిసెంబర్‌లో చేసిన నిరాహార దీక్షతో కేంద్రం దిగిరాక తప్పలేదు. తెలంగాణ ప్రకటించక తప్పలేదు. అయినా తెలంగాణకు అంత సులువుగా వదులుకునేందుకు నాటి ఉమ్మడి రాష్ట్ర పాలకులు సిద్దపడలేదు. పైగా రాదనుకున్న తెలంగాణ ప్రకటన వచ్చినా, కాంగ్రెస్‌,తెలుగుదేశం నాయకుల్లో కదలిక రాలేదు. నాడు రాష్ట్ర విభజనను అడ్డుకునేందుకు రాజీనామాల అస్త్రాన్ని ప్రయోగించి, తెలంగాణకు అడ్డుపడిన సీమాంధ్ర నేతల ఒత్తిడితో, వెనక్కు తగ్గిన నాటి యుపిఏ 2 ప్రభుత్వ నిర్ణయానికి నిరసనగా మరోసారి తెలంగాణలో తెరాస రాజీనామాలు చేసి, ప్రజాక్షేత్రంలోకి వెళ్లింది. మళ్లీ ఆత్మాభిమానంతో నిలిచి గెలిచింది. కాని ఒక్కపైసా కూడా తెలంగాణకు ఇవ్వమంటే నోరు మెదపని కాంగ్రెస్‌నాయకులను చూసిన తెలంగాణ సమాజం రగిలిపోయింది. తెరాస 2008లో వచ్చిన ఉప ఎన్నికల్లో ఆ నాటి తెరాస పక్షనేతను పట్టుకొని, నాటి సమైక్య ముఖ్యమంత్రి వైఎస్‌ రాజేంద్ర తలెక్కడ పెట్టుకుంటారని అన్న మాటలు తెలంగాణ ప్రజల్లో ఉద్యమాన్ని నింపింది. పోరాటం కేసిఆర్‌ పోరాటానికి అండగా నిలబడిరది. సకల జనులంతా కోట్లాది మంది కేసిఆర్‌లు అయ్యారు. ఎక్కడికక్కడ ఆ నాలుగేళ్ల కాలమంతా ఎక్కడ చూసినా తెలంగాణనినాదమే. ఆ పదమే గెలిచింది. ఆ జెండా కేసిఆర్‌తో ఎగిరిగింది. 2014లో తెలంగాణ ప్రకటన రానేవచ్చింది. ఆ ఎన్నికల్లో తెరాస విజయం సాధిసాధించింది. కేఆర్‌ను ముఖ్యమంత్రిని చేసింది. సంక్షేమ పాలనను అందించింది. అయినా సీయతెలంగాణలో కూడా రాజకీయ ఎత్తుడగలు, చంద్రబాబు లాంటి నాయకుడి రూపంలో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యహరాలు తప్పలేదు. పాలనపై నిత్యం ఏదో ఒక అడ్డంకిని సృష్టించిన కాంగ్రెస్‌కు మరోసారి తలెత్తుకోకుండా చేసి, సందు దొరికితే దూరుదామనుకుంటున్న తెలుగుదేశానికి తెలంగాణలో ఇప్పటికే నూకలు లేకుండా చేసిన, కేసిఆర్‌ ముందస్తుకు వెళ్లి, తెలంగాణ మురిసేలా విజయాన్ని మూట గట్టుకున్నారు. భవిష్యత్తు తెలంగాణకు బంగారు తెలంగాణ చేసేందుకు వున్న అడ్డంకులను ఏరిపారేశాడు. తన నాయకత్వానికి ఎదరులేదని మరోసారి నిరూపించారు. ఇప్పుడు బిఆర్‌ఎస్‌తో దేశంలో స్వర్ణ కాంతులు తేచ్చేందుకు రాజకీయ అడుగులు వేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *