*కొత్తగూడ, నేటి ధాత్రి.*
ఆదివాసీ ల ప్రాంతంలో ఎస్ టి రిజర్వేషన్ లో గెలుపొందిన సర్పంచ్ లు, ఎంపీటీసీ లు,ఎంపీపీ లు జడ్పీటీసీ లు, ఎమ్మెల్యే లు, ఎంపీలు ఆదివాసీ ప్రజా ప్రతినిధులు తమ జాతికి భారత రాజ్యాంగం లో కల్పించబడిన హక్కులు,చట్టాల అమలు కోసం పాటు పడకుండా తీవ్ర నిర్లక్ష్యం చేస్తు షెడ్యూల్డ్ ఏరియా ను కాపాడటం లో ముందు వరుస లో ఉండాల్సిన వారు రాజకీయ మనుగడ కోసం గిర్జనేతరులకు వంత పాడుతూ వారి ఓట్లకోసం తమ వ్యవస్తనే కాల రాసుకుంటూ
ఆదివాసీ ల ఆస్తిత్వం ను నాశనం చేస్తున్నారని రాజకీయ పార్టీల ఎజెండా ను మోస్తూ వలస వాద గిర్జనేతరుల తో రాజకీయ సహవాసం చేస్తూ కేవలం వ్యక్తి గత అవసరాలను తీర్చు కుంటూ ఆదివాసీ లను మోసం చేస్తున్నారని ఇకనైనా ప్రజా ప్రతి నిధులు సోయి తెచ్చుకొని ఆదివాసీ హక్కు లు చట్టాలు ప్రాంతం ను కాపాడు కోసం ప్రజల తో కలసి పోరాటం చేయడం కోసం సిద్ధం కావాలని ఈ రోజు కొత్తగూడ మండల కేంద్రం లోని ఐటీడీఎ గెస్ట్ హౌస్ యందు ఆలూరి రాజు అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో రాష్ట్ర సాంస్కృతిక కార్యదర్శి ఆగబోయిన రవి పాల్గొని మాట్లాడారు . ఈ సమావేశంలో పడిగే నగేష్,కొటేం ముఖర్జీ,తాటి సునీల్, కల్తీ శ్రీనివాస్, పడిగే మంగయ్య, సిద్దబోయిన సంజీవ్,మేడ బుచ్చిరాములు, సువర్ణ పాక వెంకట రత్నం, వజ్జ రవి,కుంజ నర్సింగరావు, సిద్దబోయిన జీవన్,దారం సమ్మయ్య, అలెం బాబుపాల్గొన్నారు.