‘సిటీ మహిళా డిగ్రీ కాలేజీ’కి అధికారుల అండ…?
హన్మకొండ ప్రొద్దుటూరి కమర్షియల్ కాంప్లెక్స్‌లో నిర్వహించబడుతున్న ‘సిటీ మహిళా డిగ్రీ కాలేజీ’ అసౌకర్యాలకు నిలయంగా ఉన్నప్పటికీ అధికారులు చర్యలు చేపట్టకపోవటం పట్ల అనేక అనుమాలు వ్యక్తమవుతున్నాయి. యధేచ్ఛగా కమర్షియల్ కాంప్లెక్స్‌లో కనీస వసతులు లేకుండా కాలేజీని నిర్వహించటానికి అధికారలు పర్మిషన్ ఎలా ఇచ్చారనే పశ్న్రలు ఉత్పన్నమవుతున్నాయి. కాలేజీ నిర్వహిస్తున్న కాంప్లెక్స్‌లో కనీస నీటి వసతి లేదు. అర్బన్ ఏరియాలో కాలేజీ నిర్వహించెందుకు కనీసం ఏకరం విస్తీర్ణంలో గ్రౌండ్ ఉంటాలనే నిబంధనల ఉన్నప్పటికీ ప్రొద్దుటూరి కాంప్లెక్స్‌లో నిర్వహించబడుతున్న కాలేజీకి ఎకరం గ్రౌండ్ ఎక్కడుందో పర్మిషన్ ఇచ్చిన అధికారులకు, కాలేజీని నిర్వహిస్తున్న యాజమాన్యానికే తెలియాలని పలువురు వాఖ్యానిస్తున్నారు. నిబంధనల ప్రకారం కనీసం 45 ఫీట్ల ఎత్తు కలిగిన భవనానికి ఖచ్చితంగా ఫైర్ సేప్టీ అవసరమని అధికారులు చెప్పుతున్నప్పటికీ అసలు ప్రొద్దులూరి కాంప్లెెక్స్ ఎత్తు ఎంత ఉందో అధికారులు ప్రత్యక్షంగా పరిశీలించే పర్మిషన్ ఇచ్చారా…? లేక గుడ్డిగా ఇచ్చారా..? అనేది మరో సారి పరిశీలించుకోవాల్సిన అవసరముందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాంప్లెక్స్‌లో కాలేజీ నిర్వహించుకునే విధంగా గ్రౌండ్, పార్కింగ్ స్థలం, నీటి వసతి ఎక్కడా కానరాకపోవటం గమనార్హం. మహిళా కాలేజీ నిర్వహణకు ఏ మాత్రం అనువుగా లేనటువంటి కాంప్లెక్స్‌లో కాలేజీ నిర్వహించటానికి అధికారులు పర్మిషన్ ఇవ్వటం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అసౌకర్యాలతో యదేచ్ఛగా యాజమాన్యం కాలేజీని నిర్వహిస్తుంటే చర్యలు చేపట్టకపోవటంతో అధికారుల తీరు పట్ల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పంధించి, నిబంధనలకు విరుద్దంగా నిర్వహించబడుతున్న ‘ సిటీ మహిళా డిగ్రీ కాలేజీ’ నిర్వహణ తీరు పట్ల సమగ్ర విచారణ జరుపటంతో పాటు, తగు చర్యలు చేపట్టాల్సిన అవసరముంది.
(రేపటి సంచికలో)