గ్రామ దేవతలను దర్శించుకున్న జడ్పీ చైర్మన్ పిఆర్ఓ రవితేజ

# గ్రామ దేవతల ప్రతిష్టాపనకు విరాళం

ములుగు జిల్లా నేటిధాత్రి

ములుగు మండల రాయినిగూడెం గ్రామంలో గ్రామదేవతలైన పోచమ్మ, బొడ్రాయి , హనుమాన్ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలు గత మూడు రోజులుగా అట్టహాసంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాలకు ములుగు జడ్పీ చైర్మన్ పీఆర్ఓ జంగిలి.రవితేజ హాజరై గ్రామ దేవతలను దర్శించుకున్నారు. అనంతరం తన వంతు విరాళాన్ని అక్కడి గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో కార్యక్రమ నిర్వాహకులు ఆగబోయిన వెంకన్న, ఆగబోయిన సాంబయ్య, పాయం నరేష్, ఎండి అక్బర్ పాషా, దామరనేని రవీందర్ రావు, మాజీ సర్పంచ్, ఈసాల చంద్రయ్య, వాసం పాపయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *