ఓ గతంలో నాటి ఎకాహళ్లి..నేటి జహీరాబాద్
జహీరాబాద్ నేటి ధాత్రి:
పల్లెగా ఉన్న జహీ రాబాద్ నేడు జిల్లా లోనే పెద్దపట్టణాల్లో ఒక్కటిగా విరాజిల్లు తోంది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక కూడా నిజాం పరి పాలనలో ఉన్న ఈ ప్రాంతం కర్ణాటకలోని బీదర్ జిల్లాలో కొనసాగింది. అప్పట్లో చిన్న ఊరుగా ఉండడంతో కన్నడలో ఎకాహళ్లి (పల్లె), ఎక్కెల్లిగా పిలిచేవారు. నేటికి కొందరు అదే పేరుతో పిలు స్తున్నారు. నిజాం నవాబుల పాలనలో జహీర్యార్జింగ్ అనే జాగీర్దార్ ఈ ప్రాంతాన్ని చూసుకునేవారు. ఆయన పేరుతోనే ‘జహీరాబాద్ పేరొచ్చింది. 1945లోనే హైదరా బాద్ నుంచి జహీరాబాద్ మీదుగా బీదర్, గుల్బర్గా (కల బుర్గి)ని కలిపే ఓ రోడ్డు ఉండేది. అప్పట్లో హైదరాబాద్ నుంచి జహీరాబాద్కు రోజుకు రెండు ట్రిప్పులు ఎన్ఎస్ఆర్ ఆర్టీడీ (నిజాం స్టేట్ రైల్వే అండ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్ మెంట్)కు చెందిన బస్సులు నడిపేవారు. ఆ రోడ్డే ముంబయి-విజయవాడ 65వ నంబరు జాతీయ రహదారిగా మారింది.
