# ఎమ్మెల్యే దొంతి ఆదేశాలతో కదిలిన యంత్రాంగం.
# దగ్గరుండి పర్యవేక్షించిన జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి తక్కళ్లపెల్లి రవీందర్ రావు,
# పనులు ముమ్మరం చేసిన జిల్లా సివిల్ సప్లై మేనేజర్ సంధ్యారాణి.
నర్సంపేట,నేటిధాత్రి :
వరంగల్ జిల్లా ఖానాపురం మండలం అశోక్ నగర్ గ్రామంలోని నిర్వహిస్తున్న వరిధాన్యం కొనుగోలు కేంద్రాలలో నిల్వ ఉన్న ధాన్యాన్ని తక్షణం మిల్లులకు తరలింపుకోసం హుటాహుటిన ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి ఆదేశాలతో అధికార యంత్రాంగంతో కలిసి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి, మాజీ ఎంపీపీ తక్కళ్లపెల్లి రవీందర్ రావు తగు చర్యలు చేపట్టారు. సోమవారం ఉదయం నుంచి రవీందర్ రావు సెంటర్ లను పర్యవేక్షిస్తూ అదనపు కాంటాలను ఏర్పాటు చేయడం, ఇతర ప్రాంతాల నుంచి హమాలీలను రప్పించడం,అదనంగా ట్రాన్స్ పోర్ట్ లారీలను పెంచుతూ ప్రత్యక్షంగా పరిశీలిస్తూ తగు చర్యలు తీసుకోవడంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు. ఖానాపూర్ మండలంలో రబీ సీజన్ లో రైతులు ఎండల్లో పండించిన వరిధాన్యంఎన్నో వ్యయప్రయసాలకు ఓర్చుకొని కొనుగోలు కేంద్రాలకు తరలించారు.ఆదివారం రాత్రి కురిసిన వర్షానికి ధాన్యం తడిస్తే రైతన్నలు ఇబ్బందులు ఎదుర్కొంటారని భావించిన నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి తక్షణమే జిల్లా పౌరసరఫరాల అధికారులను పురమ
అదేశించటంతో జిల్లా సివిల్ సప్లై మేనేజర్ సంధ్యరాణి,డి టి స్వప్న లతో పాటు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీపీ తక్కళ్లపెల్లి రవీందర్ రావు కలిసి కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. నిల్వ ఉన్న ధాన్యాన్ని తక్షణమే తరలించటానికి ఇతర గ్రామాల నుండి హమాళి కార్మికులను రప్పించి,అధిక ఎలక్ట్రానిక్ కాంటాలను ఏర్పాటు చేసి అధిక లారీల సహాయంతో ధాన్యాన్ని సంబంధిత మిల్లులకు తరలించేలా చర్యలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో కొనుగోలు కేంద్ర నిర్వాహకులు, రైతులు,కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.