నామ గెలుపు నల్లేరు మీద నడకే..ఎంపీ వద్దిరాజు రవిచంద్ర

కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుకపోయినట్లు, బీఆర్ఎస్ ఓడడంతో ప్రజలు బాధపడుతున్నరు: ఎంపీ రవిచంద్ర

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 125 రోజులవుతుంది,ఏ ఒక్క హామీ కూడా అమలు కావడం లేదు: ఎంపీ రవిచంద్ర

రుణమాఫీ అమలు కాలేదు,పంట బోనస్ లేదు,రేషన్ కార్డులు లేవు: ఎంపీ రవిచంద్ర

ఈ ఎన్నికల్లో కూడా అధికారంలో ఉన్న పార్టీకి ఓటేస్తే, పాలకులు ప్రజల్ని పూర్తిగా మర్చిపోతరు: ఎంపీ రవిచంద్ర

వెంకటవీరయ్య ఓటమి సత్తుపల్లి ప్రజల దురదృష్టం: ఎంపీ రవిచంద్ర

ప్రజల పక్షాన పార్లమెంటులో బలమైన వాణి వినిపిస్తున్న నాగేశ్వరరావును మనమందరం భారీ ఓట్ల మెజారిటీతో గెలిపిద్దాం: ఎంపీ రవిచంద్ర


కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుకపోయినట్లు అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడడంతో తాము చేసిన పొరపాటుకు ప్రజలు బాధపడుతున్నారని రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర అన్నారు.కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 125 రోజులవుతున్న ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చడం లేదని నిశితంగా విమర్శించారు.కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిన రూ. 2లక్షల రుణమాఫీ,వరి క్వింటాలుకు రూ.500బోనస్,రూ.4వేల పింఛన్లు అమలు జాడనే లేదని ఎంపీ రవిచంద్ర దుయ్యబట్టారు.


ఖమ్మం లోకసభ నియోజకవర్గ ఎన్నికల సన్నాహాక సమావేశం సత్తుపల్లి నియోజకవర్గం పెనుబల్లి మండలం వీ.ఎం.బంజారాలో శుక్రవారం సాయంత్రం జరిగింది.ఈ సమావేశానికి ఎంపీ రవిచంద్ర లోకసభలో బీఆర్ఎస్ పక్ష నేత, పార్టీ ఖమ్మం లోకసభ నియోజకవర్గ అభ్యర్థి నామ నాగేశ్వరరావు,బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్సీ తాతా మధు, సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యలతో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఎంపీ రవిచంద్ర మాట్లాడుతూ,పేదలకు తెల్ల రేషన్ కార్డులిస్తామని హడావుడి చేసి విస్మరించారన్నారు.కాంగ్రెస్ పార్టీకి లోకసభ ఎన్నికల్లో కూడా పొరపాటున ఓటేస్తే,వాళ్లు ప్రజల్ని పూర్తిగా మర్చిపోయే ప్రమాదం పొంచి ఉందన్నారు.ప్రజలకు ఇప్పుడిప్పుడే బాగా తెలిసి వస్తున్నదని,బీఆర్ఎస్ ఓడిపోవడం, కేసీఆర్ అధికారం కోల్పోవడం పట్ల అన్ని వర్గాల వాళ్లు బాధపడుతున్నారని చెప్పారు.తాము చేసిన పొరపాటును గ్రహించిన ప్రజలు లోకసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఏకపక్షంగా ఓట్లు వేస్తారన్న విశ్వాసాన్ని ఎంపీ వద్దిరాజు వ్యక్తం చేశారు.మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అంకితభావం,నిబద్ధత కలిగిన నాయకుడని,ఆయన ఓడిపోవడం సత్తుపల్లి ప్రజల దురదృష్టమన్నారు.సండ్ర ఓడిపోయారంటే కేసీఆర్ గారు కూడా నమ్మలేకపోయారని ఎంపీ రవిచంద్ర చెప్పారు.పార్లమెంటులో తెలంగాణ ప్రజల పక్షాన బలమైన వాణి వినిపించిన బీఆర్ఎస్ అభ్యర్థి నామ నాగేశ్వరరావును మనమందరం సైనికుల మాదిరిగా పనిచేసి భారీ ఓట్ల మెజారిటీతో గెలిపిద్దామని ఎంపీ వద్దిరాజు గులాబీ శ్రేణులను కోరారు.సమావేశానికి కనగాల వెంకట్రావు అధ్యక్షత వహించగా,ఎంపీపీ లక్కినేని అలేఖ్య,జేడ్పీటీసీ చెక్కిలాల మోహన్ రావు,మండల కో-ఆప్షన్ మెంబర్ గౌస్ తదితర ప్రముఖులు ప్రసంగించారు.ఈ సందర్భంగా “జై తెలంగాణ జైజై తెలంగాణ”,”జిందాబాద్ జిందాబాద్ బీఆర్ఎస్ జిందాబాద్”,”వర్థిల్లాలి వర్థిల్లాలి కేసీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి”,”కారు గుర్తుకే మన ఓటు,నామ నాగేశ్వరరావు కారు గుర్తుకే మన ఓటు”,”గెలిపిద్దాం గెలిపిద్దాం బీఆర్ఎస్ అభ్యర్థి నామ నాగేశ్వరరావును భారీ ఓట్ల మెజారిటీతో గెలిపిద్దాం”అంటూ గులాబీ శ్రేణులు పెద్ద పెట్టున నినదించారు.ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ నాయకులు కస్తూరి,పసుపర్తి వెంకటేశ్వరరావు,బెల్లంకొండ చలపతిరావు, లగడపాటి శ్రీనివాసరావు, తాళ్లూరి జీవన్, సింహాద్రి యాదవ్,లక్కినేని వినీల్, వేముల నర్సింహారావు, సుధీర్ బాబు,కృష్ణయ్యలతో పాటు పెద్ద సంఖ్యలో గులాబీ శ్రేణులు హాజరయ్యారు.ఈ సందర్భంగా రాజ్యసభకు తిరిగి ఏకగ్రీవంగా ఎన్నికై పదవీ ప్రమాణం చేసిన ఎంపీ వద్దిరాజును బీఆర్ఎస్ నాయకులు శాలువాలతో సత్కరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!