గాలి వాన బీభత్సం.. నేల వాలిన పంటలు
అకాల వర్షం రైతన్నల పాలిట శాపం
శాయంపేట నేటిధాత్రి:
శాయంపేట మండల కేంద్రంలో నిన్న రాత్రి సమయంలో అకాల వర్షాల కారణంగా రైతులకు తీవ్ర నష్టం వాటిళ్లింది.చేతికి వచ్చిన పంట అకాల వర్షాల కారణంగా నేల రాలడంతో తమకు తీవ్రనష్టం వాటిళ్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మండల పరిధిలో రాత్రి సమయంలో ఊహించని విధంగా తుఫాన్ ను తలపించే లాగా విపరీతమైన ఈదురు గాలులతో వర్షం బీభత్సం సృష్టించింది.

దాదాపు ఒక గంటపాటు తీవ్రమైన ఉరుము లు మెరుపులతో ఎడతెగని గాలి,వాన కురిసింది. పలు గ్రామాల్లో ఈదురుగాలుల కారణంగా రాత్రంతా బిక్కు బిక్కుమంటూ గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది కల్లాలలో ఉన్న మొక్కజొన్న, వరి పంటలు తడిచి ముద్దయిన పరిస్థితి ఏర్పడింది. ఆరుగాలం శ్రమించి పండించిన పంటలను కల్లాల్లో చూసుకుని ఇక తమ కష్టాలు తప్పుతాయని భావిం చిన కొద్దిసేపట్లోనే అకాల వర్షం రైతన్నల ఆశలను అడియాశ లు చేసింది. ఏదై ఏమైనా ఈ అకాలవర్షం రైతులకు తీవ్ర నష్టాన్ని కలిగించిందని చెప్పవచ్చు.
ప్రభుత్వమే ఆదుకోవాలి రైతన్నల ఆవేదన
మూసికె అశోక్ శాయంపేట రైతు
శాంపేట మండలంలో మంగళవారం రాత్రిపూట వర్షానికి రైతులు చాలు చేసిన మొక్కజొన్న పంట అరటి చెట్లు పూర్తిగా నేలకొరిగింది. మండలంలోని ముష్క అశోక్ మూడు ఎకరాల మొక్కజొన్న పంట సాగు చేశారు మంగళవారం రాత్రి కురిసిన గాలివాన బీభత్సానికి పంట అంతా నేలకొరిగింది దీంతో రూపాయల నష్టం జరిగిందని బాధిత రైతు ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యానవన పంటలలలో అరటి చెట్లు గాలివాన బీభత్సానికి నెలకు వాలింది. కూతురు రాజు, కోల మల్లయ్య, కోల చక్రపాణి, గాదె చిరంజీవి, కురాకుల ప్రశాంత్ 10 ఎకరాల నష్టం వాటిల్లింది. ఆరుగాలం కష్టపడి పండించిన పంట వర్ష పాలవడంతో ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

వర్షానికి దెబ్బతిన్న పంటలను పరిశీలించిన వ్యవసాయ అధికారులు
శాయంపేట మండల వ్యవసాయ అధికారి గంగా జమున ఆదేశాల మేరకు మండల పరిధిలోని మైలారం, పెద్దకోడేపాక, కొప్పుల, పత్తిపాక, హుస్సేన్ పల్లి, శాయంపేట, గట్లకానిపర్తి, తహరాపూర్, కొత్తగట్టు సింగారం గ్రామాలలో మంగళ వారం రాత్రి గాలివానకు దెబ్బతిన్న పంటలను అర్చన, అన్వేషు, రాకేష్ ఏ ఈ ఓ లు ఉబ్ సందర్శించడం జరిగింది. అందులో మొత్తం 245మంది రైతుల వరి చేను 347ఎకరా లు,38మంది రైతుల 57ఎ కరాల మొక్కజొన్న,15మంది రైతుల 30ఎకరాలు అరటి తోట దెబ్బతిన్నాయి.