`జనం ఏ పార్టీని నమ్మొచ్చు! ఏ పార్టీని నమ్మకపోవచ్చు!!
`బీసీ నినాదంతో బలపడేదెవరు! బాగుపడేదెవరు!
`ఇప్పుటి దాక వున్న బీసీ కమీషన్లు ఏం సాధించాయి!
`బీసీ కార్పోరేషన్లు ఎంత మందిని ఉద్దరించాయి?
`బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు పార్టీలకు లాభమా!
`ప్రజలకు మేలు జరుగునా?
`బీసీలు కుర్చీలో కూర్చుంటే ఆ కులాలకు మేలు చేస్తారా?
`బీసీ రాజకీయ రిజర్వేషన్లు ఏ పార్టీకి లాభిస్తాయి?
`స్థానిక సంస్థల ఎన్నికలలో ఎవరికి మేలు!
`42శాతం అమలు చేసిన కాంగ్రెస్‌కు వరమౌతుందా?
`ప్రతిపక్షాలు గెలవటానికి కారణమౌతుందా?
`బీసీ బిల్లుతో కాంగ్రెస్ మెజారిటీ స్థానాలు గెల్చుకుంటుందా?
`పల్లె రాజకీయాలలో పార్టీల పాత్ర పని చేస్తుందా?
`ఇప్పటికిప్పుడు బీసీ నినాదం కాంగ్రెస్ కు మేలు చేస్తుందా?
`ప్రతిపక్షాలకు వరమౌతుందా?
`ఇంతకీ కేంద్రం రాష్ట్ర ప్రభుత్వం పంపిన బిల్లుకు ఆమోదం తెలుపుతుందా?
`లేకుంటే జనరల్ స్థానాలన్నీ బీసీలకు కేటాయిస్తారా?
`పల్లెల్లో పరిస్థితులు కాంగ్రెస్‌కు అనుకూలంగా వున్నాయా!
`పల్లెల్లో రైతులు సంతోషంగా వున్నారా?
`ప్రజల ఆకాంక్షలు కాంగ్రెస్ నెరవేర్చిందా?
`ఉద్యోగ కల్పనతో పల్లెల్లో ప్రజలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారా?
`ప్రజా వ్యతిరేకత బీసీ బిల్లులో కొట్టుకుపోతుందా?
`బీసీ, ఓబీసీ రుణాలు స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ పట్టం కడతాయా?
`తాజాగా ప్రభుత్వం యువతకిచ్చే రుణాలు ఓట్లు రాల్చుతాయా!
`కాంగ్రెస్ ప్రచారం చేసుకోవడంలో సఫలమౌతుందా!
`ప్రతిపక్షాలకే మేలు జరిగేలా వుంటుందా!
,హైదరాబాద్,నేటిధాత్రి:
తెలంగాణ రాజకీయాలలో బిసి నినాదం తుఫాను సృష్టించేలా వుందని చెప్పడంలో సందేహం లేదు. ఎందుకంటే ఇటీవల జరిగిన కరీంనగర్ పట్టభద్రుల ఎన్నికల్లో బిసి ఓటర్లు తమ ప్రభావాన్ని చూపారని తేలింది. అంతే కాకుండా గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి బిసి డిక్లరేషన్ ప్రకటించింది. అప్పటి నుంచి బిసి నినాదం ఊపందుకున్నది. ఇక్కడ రెండు విషయాలు చెప్పుకోవాలి. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమాన్ని ముందు మొదలుపెట్టింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో వున్నప్పుడు చిన్నారెడ్డి అద్యక్షతన తెలంగాణ కాంగ్రెస్ కమిటీ ఏర్పాటైంది. 42 మంది కాంగ్రెస్‌ఎమ్మెల్యేల సంతకాలతో తెలంగాణ వాదానికి మలి దశ ఊపిరి పోసింది. తర్వాత తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసింది. కాకపోతే తెలంగాణ తీర్మాణం 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపుకు ఎంతో దోహదంచేసింది. అదే సమయంలో బిఆర్‌ఎస్‌కు రాజకీయంగా కూడా పనికి వచ్చింది. తర్వాత పద్నాలుగు సంవత్సరాలకు తెలంగాణవచ్చింది. కాని కాంగ్రెస్‌కు మేలు జరగలేదు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి పాలయ్యింది. కాని తెలంగాణ కల నెరవేర్చినట్లైంది. తెలంగాణ కాంగ్రెస్ ఇచ్చిందన్న పేరు చరిత్రలో నిలిచిపోయింది. అలాగే గతంలో ఎన్ని బిసి ఉద్యమాలు వచ్చినా రాజ్యాధికారం కోసం ఏనాడు వాణ వినపడలేదు. ఎంత సేపు ఉద్యోగాలలో రిజర్వేషన్లు, ప్రమోషన్లలో రిజర్వేషన్లపై పోరాటాలు సాగేవి. అంతే కాకుండా బిసి కార్పోరేషన్ ద్వారా బిసి యువతకు రుణాల కోసం పోరాటాలు జరిగేవి. ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ బిసి డిక్లరేషన్ ప్రకటించిందో ఒక్కసారిగా బిసి సంఘాలలో కదలిక వచ్చింది. బిసి కుల సంఘాలలో చైతన్యం నిండిర ది. రాజకీయ పార్టీలన్నీ జై బిసి నినాదం అందుకున్నాయి. ఇక్కడ కూడా ఆ పుణ్యం కాంగ్రెస్‌కే దక్కుతుంది. కాని దాని ఫలితం ఎవరికి దక్కుతుందనేది మాత్రం ఇప్పటికిప్పుడు చెప్పలేకుండా వుంది. గత ఎమ్మెల్సీ ఎన్నికలలో బిసిలకు టికెట్లు ఇచ్చేందుకు పార్టీలు కూడా ముందుకొచ్చాయి. గతంలో ఈ వాతావరణం కనిపించలేదు. ఇప్పుడు జనరల్ సీట్లలో మొత్తానికి మొత్తం ఓసిలకు కట్టబెట్టేందుకు రాజకీయ పార్టీలు ఒకటికిపదిసార్లు ఆలోచించే పరిస్దితి వచ్చింది. ఇక తాజాగా మంత్రి వర్గ విస్తరణలో కూడా బిసిల ప్రాధాన్యం పెంచాలని చూస్తున్నారు. మరో వైపు బిజేపి బిసి నినాదాన్ని ఎంచుకున్నది. గత ఎన్నికల సమయంలోనే బిసి ముఖ్యమంత్రి నినాదం ప్రకటిస్తారని అనుకున్నారు. కాని కుదరలేదు. బిఆర్‌ఎస్ పార్టీ కూడా బిసి విధానాన్ని, నినాదాన్ని కూడా వినిపిస్తూ వుంది. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బిసి విధానమే ఏకైక ఎజెండాగా రాజకీయాలకు ఎంచుకున్నది. బసిలకు రాజ్యాదికారం కోసం బిఆర్‌ఎస్ కూడా ముందుకు రావాల్సి వస్తోంది. కవిత మూలంగా బిఆర్‌ఎస్ కూడ బిసి నినాదం అందుకోవాల్సి వస్తోంది. ఏ మాట కామాటే చెప్పుకోవాలి. కల్వకుంట్ల కవిత గత రెండు సంవత్సరాలకు పైగా బిసి నినాదాన్ని వినిపిస్తోంది. కాని కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ తర్వాతే బిసిలలో మరింత చైతన్యం నిండిరది. ఎందుకంటే సామాజిక న్యాయం అన్నది కాంగ్రెస్‌లోనే సాద్యం. బిఆర్‌ఎస్‌లో అది సాధ్యం కాదు. పదేళ్ల అదికారంలో సాద్యం కాలేదు. కనీసం ఓ నలుగురు బిసి మంత్రులు లేరు. ఇక బిజేపి ప్రదాన మంత్రి నరేంద్ర మోడీ బిసి అంటూ చెప్పుకుంటారు. కాని ఇప్పటి వరకు వారి బిసి విదానాన్ని ప్రకటించలేదు. అయినా బిసిలు బిజేపిని మిగతా పార్టీలకన్నా ఎక్కువ నమ్ముతున్నారన్నది ఇతర పార్టీలు గుర్తించాలి. పైగా ఇటీవల బిసి కృష్ణయ్యను పిలిచి మరీ రాజ్యసభ ఇచ్చారు. బిసిల విషయానికి వస్తే సామాజిక న్యాయం జరగాలంటే సహజంగా జాతీయపార్టీలతోనే సాద్యమౌతుంది. అయితే బిఆర్‌ఎస్ పార్టీ కూడా జాతీయ పార్టీగా అవతరించాలని అనుకుంటోంది. భవిష్యత్తులో బిసిల రాజ్యాధికారం విషయంలో బిఆర్‌ఎస్ ఒక అడుగు ముందుకు వేస్తుందా? లేదా? అన్నది తెలుస్తుంది. కాని బిసిలకు తగిన న్యాయం చేయడంలో జాతీయ పార్టీలకే సాధ్యమౌతుందని చెప్పాలి. కొన్ని నిజాలు కటువుగా వుంటాయి. వాటిని జీర్ణించుకోవడం కొన్ని పార్టీలకు కష్టంగానే వుంటుంది. ఒక వేళ రాష్ట్రంలో బిఆర్‌ఎస్ అదికారంలో వుంటే బిసి నినాదం వుండేదా? బిసి నినాదం చేపట్టేవారుండేవారా? వున్నా బిఆర్‌ఎస్ పట్టించుకునేదా? కేసిఆర్ బిసిలకు సపోర్టు చేసేవారా? బిసి బిల్లు తెచ్చేందుకు అంగీకరించేవారా? అంటే అసలే వుండేది కాదు. బిసి అనే ఉద్యమమే పురుడు పోసుకునేది కాదు. ఇంత త్వరగా బిసి బిల్లు వచ్చేదే కాదు. కాని కాంగ్రెస్ వల్లనే సాధ్యమైంది. కాని ఆ క్రెడిట్ కాంగ్రెస్‌కుఎంత వరకు దక్కుతుందనేది కూడా ప్రశ్నార్ధకమే. ఇప్పడు బసి బిల్లుకు మేం సంపూర్ణ మద్దతు తెలిపామంటూ బిఆర్‌ఎస్ చెప్పుకునే ప్రయత్నం చేస్తుంది. బిజేపి కూడా బిసి కార్డు వినియోగించుకునేందుకు ఏ మాత్రం వెనుకాడదు. ఇలాంటి పరిస్తితుల్లో కాంగ్రెస్‌కు ఏ మేర రాజకీయంగా ఉపయోగపడుతుందనేది ఎన్నికలు జరిగితే గాని తెలియకపోవచ్చు. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ బలంగా ప్రజల్లోకి తీసుకుపోవాల్సిన అసవరం వుంది. లేకుంటే రాజకీయంగా ప్రయోజనం కన్నా, నష్టమే ఎక్కువ జరుగుతుంది. దశాబ్దాల బిసి పోరాటం ఇప్పుడు నిజమైంది. ఎంతో కొంత ఫలితాలు మోసుకొస్తుంది. బిసిలకు రాజకీయంగాఎంతో ఉపకరిస్తుంది. ఓసిల ఆధిపత్యం పల్లెల్లోనే కాదు, పట్టణాల్లో కూడ చాల వరకు తగ్గుతుంది. ఇంత ముందుకు జనరల్ అంటే ఓసిలే అన్నట్లుగా భావిస్తూ వచ్చేవారు. అందువల్ల బిసిలు పెద్దగా ఎన్నికల్లో పోటీ చేసేందుకు ముందుకు వచ్చే వారు. ఎవరైనా ముందుకొచ్చినా వారికి అవకాశాలు అంతగా దక్కేవి కాదు. కాని ఇప్పుడు అటు జనరల్‌లో అయినా, ఇటు బిసి రిజర్వేషన్లలో అయినా బిసిలకు తప్పని పరిస్ధితులత్లో టికెట్లు ఇవాల్సిన అవసరం ఏర్పడుతుంది. రాజకీయ పార్టీలు బిసి నాయకులకు జై కొట్టాల్సి వస్తుంది. ఇంత వరకు బాగానే వుంది. కాని ఇప్పటికిప్పుడు తెలంగాణలో రాజకీయ పరిస్ధితులు ఎలా వున్నాయన్నది కూడా ఎంతో ముఖ్యం. ఇప్పటికిప్పుడు పంచాయితీ ఎన్నికలు నిర్వహించడం ఏ మాత్రం మంచిది కాదు. పల్లెల్లో ఎవరు ఔనన్నా, ఎంత కాదన్నా కాంగ్రెస్‌కు అంత అనుకూలమైన పరిస్ధితులు లేవు. ఎంత గొప్పగా చెప్పుకున్నా రైతుల్లో కొంత నిస్తేజం ఆవహించి వుంది. పల్లెల్లో సాగు నీటి వసతి తగ్గింది. ఈ విషయం కాంగ్రెస్ పార్టీ కూడా అంగీకరించని పరిస్ధితి ఎదురౌతోంది. ఎన్నికల హామీల అమలుపై ప్రజల్లో అనేక సందేహాలున్నాయి. రైతు బంధు విషయంలో కాంగ్రెస్ మాటలకన్నా, బిఆర్‌ఎస్ మాటలే ప్రజల్లోకి బలంగా వెళ్తున్నాయి. రైతు బంధుపై అపోహలను ప్రజలకు వివరించే ప్రయత్నాలు కాంగ్రెస్‌పార్టీ నాయకులు, మంత్రులే చేయలేకపోతున్నారు. ఏక కాలంలో రైతు రుణమాఫీ జరిగిందన్న వాస్తవాలు కళ్లముందే వున్నా, అవి అందరికీ అందలేదన్న అసంతృప్తి కూడా వుంది. ఇక ఇ ందిరమ్మ ఇండ్ల విషయానికి వస్తే ఎంత వరకు కాంగ్రెస్ సక్సెస్ అవుతుందన్నదానిలో అంచనాలు లేవు. మరో వైపు కళ్యాణ లక్ష్మి వంటి పధకాలు అమలు జరుగుతున్నా, తులం బంగారం విషయం ప్రజల్లో అసంతృప్తి వుంది. ఇక నాలుగు వేల పింఛన్లపై అందుకుంటున్న వారిలో కూడా ఎప్పుడెప్పుడా అన్న ప్రశ్నలే నెలకొని వున్నాయి. ఇక రేషన్ కార్డులు ఇప్పటికిప్పుడు ఎంత మందికి అందుతాయన్నదానిపై పూర్తి క్లారిటీ లేదు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించినా సరే, అది ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చిపెట్టినట్లు కనిపించడం లేదు. ఇలా ఎన్నికల హమీల అమలుపై ప్రజల్లో అసహనం వుంది. ముఖ్యంగా రైతాంగానికి ఎంతో కొంత అసంతృప్తి వుంది. పదేళ్ల కాలంలో చెరవులు నిండుకుండుల్లా కాలంతో సంబంధం లేకుండా నీళ్లుండేవి. అవి కాంగ్రెస్ నేతలు కూడా అంగీకరించాల్సిన పరిసి ్దతి. చెరువులను ఎప్పటికిప్పుడు నింపే ప్రయత్నం చేస్తే తెలంగాణలో భూగర్భ జలాలు అడుగంటేవి కాదు. రైతులు కొత్తగా బోర్లు వేసుకునే పరిస్దితి వచ్చేది కాదు. ఇంకా వేసవి ముదరలేదు. పంటలు చేతికొచ్చే సమయం వరకు పంటల పరిస్దితి ఎలా వుంటుందో ఎవరూ చెప్పలేని పరి స్ధితి. గత పదేళ్ల కాలంలో అసెంబ్లీకి ఎండిన వరి కర్రలు కాంగ్రెస్ ఎప్పుడూ పట్టుకురాలేదు. కరంటు లేదని కందిళ్లు తెచ్చే అవసరం రాలేదు. ఇప్పుడు అవకాశం దొరికితే చాలు బిఆర్‌ఎస్ ఈ సమస్యలను ముందు పెడుతోంది. వానా కాలంలోనే చెరువులు నింపితే ఈ పరిస్ధితి వచ్చేది కాదు. బిఆర్‌ఎస్ మాట్లాడేందుకు అవకాశముండేదే కాదు. గత పంట కాలంలో రికార్డు స్ధాయి పంటలు పండినా, ఇప్పుడు ఒక్క ఎకరా ఎండినా ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుంది.. అలాంటి సమయంలో బిసి బిల్లు తెచ్చిన సంతోషం నాయకుల్లో కనిపించినా, ఓట్లుగా మల్చుకోవడంతో కాంగ్రెస్ పార్టీ ఏ మేరకు కృషి చేస్తుందో చూడాలి. లేకుంటే బిసి బిసి బిల్లు పేరుతో పంచాయతీ గెలుపు బిఆర్‌ఎస్ చేతుల్లో పెడుతుందో చూడాలి. అంతే కాకండా ఇటీవల బిసి యువతకు సుమారు రూ.6వేల కోట్ల రూపాయలలో కొన్ని లక్షల మందికి రుణాలు ఇవ్వాలని ప్రభుత్వం సంకల్పించింది. దరఖాస్తులు కూడా ఆహ్వానిస్తోంది. బిసిల నినాదం ఎంచుకొని అమలు దిశగా అడుగులు వేస్తున్న కాంగ్రెస్‌కు ఏ మేరకు సహకరిస్తారన్నది కూడా చూడాలి. మరో వైపు ఉద్యోగ కల్పనలో బిఆర్‌ఎస్ కన్నా ఒక అడుగు ముందుకు వేసి, ఉద్యోగాలను భర్తీ చేస్తోంది. ఆ ప్రభావం కూడా స్ధానిక సంస్దల ఎన్నికల్లో కాంగ్రెస్‌కు కలిసి వస్తే మాత్రం తెలంగాణలో ఇక కాంగ్రెస్‌కు ఎదురుదండదు. తిరుగుండదు. చూద్దాం…బిసిలు ఎటు వైపు నిలుస్తారో..ఎటు వైపు నడుస్తారో…