ఎమ్మెల్యే అభ్యర్థి ఆలా వెంకటేశ్వర్ రెడ్డి.
మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి
తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు కొనసాగాలంటే మళ్లీ కేసీఆరే సీఎం గా కావాలని బీఆర్‌ఎస్ దేవరకద్ర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు.
మదనాపురం మండలం అజ్జకొలు గ్రామంలో సోమవారం కారుగుర్తు అభ్యర్థి ఆల ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఎమ్మెల్యే అభ్యర్థి ఆల మాట్లాడుతూ
అజ్జకొలు గ్రామంలో 35 కోట్లతో 58 లక్షల నిదులతో గ్రామంలో అభివృద్ధి సంక్షేమం జరిగింది
గ్రామంలో మన ఊరు మన బడి పాఠశాల మరియు సిసి రోడ్లు,డ్రైనేజీలు నిర్మించినం
మళ్లీ కేసీఆరే సీఎంగా కావాలి
అప్పుడే అభివృద్ధి, సంక్షేమ పథకాలు కొనసాగుతాయి
దేవరకద్ర గులాబీ జెండా ఎగురవేయాలి: ముఖ్యమంత్రి కేసీఆర్ పేదల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారన్నారు. అన్ని వర్గాల ప్రజలకు బీఆర్‌ఎస్ ప్రభుత్వం అండగా నిలుస్తున్నదన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో, దేవరకద్ర నియోజకవర్గం గొప్పగా అభివృద్ధి చేశామన్నారు.
గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా పనులు చేసినట్లు చెప్పారు.
ప్రతి ఇంటికీ తాగునీరు అందించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు.
ప్రజలు ఓటుతో ప్రతిపక్షాలకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.
దేవరకద్ర మరోమారు గులాబీ జెండాను ఎగురవేసేందుకు ప్రజలు సిద్ధం కావాలని కోరారు.
తెలంగాణకు సీఎం కేసీఆర్ శ్రీరామరక్ష అన్నారు.
ప్రచారంలో భాగంగా మహిళలు బతుకమ్మలు, బోనాలు, మంగళహారతులతో ఘన స్వాగతం పలికారు.
ఎమ్మెల్యే అభ్యర్థి ఆల ప్రతి ఒక్కరిని కలిసి ఆప్యాయంగా పలకరించారు. వివిధ గ్రామాల ప్రజలను
కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో గట్టు తిమ్మప్ప , కాటం ప్రదీప్ కుమార్ గౌడ్ ,జడ్పిటిసి కృష్ణయ్య , బాలమనెమ్మ ,పాల్గొన్నారు.