కాంగ్రెస్‌ అంటే కరువు, కష్టం, చీకటి!?

https://epaper.netidhatri.com/

`కాంగ్రెస్‌ తెలంగాణ ఇచ్చిన పార్టీ కాదు…నిండా ముంచిన పార్టీ.

`తెలంగాణ ను అరిగోస పెట్టిన పార్టీ.

`తెలంగాణను ఆగం చేసిన పార్టీ.

`తెలంగాణ ను ఎడారి చేసిందే కాంగ్రెస్‌.

`పెనం మీద నుంచి పొయ్యిలో వేసిందే కాంగ్రెస్‌.

`భాషా ప్రయుక్త రాష్ట్రాల పేరుతో కలిపిందే కాంగ్రెస్‌.

కాంగ్రెస్‌ పార్టీ వల్ల తెలంగాణ సమాజం ఎంతో నష్టపోయింది. కొన్ని తరాలు కష్టాలు అనుభించింది. అరవై ఏళ్లు తెలంగాణ చీకట్లలో మగ్గాల్సివచ్చింది. నమ్మితే మళ్ళీ పాత రోజులే అంటున్న చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్‌, నేటిధాత్రి ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావు తో పంచుకున్న విషయాలు.. ఆయన మాటల్లోనే

`ఇప్పుడు ఇచ్చామంటూ మళ్ళీ మోసం చేయాలని చూస్తున్నది.

`పచ్చి తెలంగాణ వ్యతిరేకి రేవంత్‌.

`తెలంగాణ ఉద్యమకారులను గన్‌ తో బెదిరించిందే రేవంత్‌.

`తెలంగాణ ప్రభుత్వాన్ని కూలదోయాలని చూసిందే రేవంత్‌.

`తెలంగాణ ఆత్మ గౌరవం దెబ్బ తీసిందే రేవంత్‌.

`రేవంత్‌ ను నమ్మేందుకు ప్రజలు సిద్దంగా లేరు.

`తెలంగాణ లో కాంగ్రెస్‌ కు చోటు లేదు.

హైదరాబాద్‌,నేటిధాత్రి:

కాంగ్రెస్‌ అంటేనే కష్టాలు, కన్నీళ్లు, ఆకలిబాధలు, కరువులు, చీకట్లు…కాంగ్రెస్‌ పాలనలో ఇవన్నీ చూసింది తెలంగాణ సమాజం. అన్ని బాధలు అనుభవించింది తెలంగాణ. కాంగ్రెస్‌ పెట్టింది ఒక్క బాధైతే చెప్పుకోవచ్చు. కాని ప్రతి క్షణం బాధలే..ప్రతి రోజు గోసలే… దాని పాలనంతా కష్టాలే..ప్రజలకు నష్టాలే..మిగిలినవి చేదు జ్ఞాపకాలే..ఆకలి కేకలే…ఇక రేవంత్‌న నమ్మితే తెలంగాణకు మరోసారి మోసమే…మళ్లీ ఆగమే…ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన దొంగ. తెలంగాణ సమాజం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను మళ్లీ ఆగం చేయాలని చూసిన దుర్మార్గుడు. తెలంగాణను మళ్లీ పొయ్యిలో తోసేయాలని చూసిన ద్రోహి. ఇప్పటికే ఉమ్మడి పాలనే బాగుందంటున్న ద్రోహిని తెలంగాణ ప్రజలు అసలే క్షమించరు. వందల మంది యువత ప్రాణాలు త్యాగాలు చేసి, తెలంగాణ సాధించుకున్నాం. ఆ సాధించుకున్న తెలంగాణలో అమరవీరుల త్యాగాలను అవమానించిన రేవంత్‌కు మన గడ్డమీద వుండే అర్హత లేదు. తెలంగాణలో రాజకీయాలు చేసే నైతికత లేదు. తెలంగాణలో ఓట్లడిగి రాజకీయం చేసే హక్కేలేదు. ఎందుకంటే ప్రపంచంలో ప్రతి సమజానికి ఒక ప్రత్యేకమైన ఆత్మగౌరవం వుంది. ఆత్మాభిమానం వుంది. సీమాంధ్రకు, తెలంగాణకు కొన్ని వైరుధ్యాలున్నాయి. ఆచార వ్యవహారాలలో తేడాలున్నాయి. బాషలో, యాసలు ప్రత్యేకంగా వున్నాయి. పండుగలు ప్రత్యేకతను సంతరించుకొని వున్నాయి. తెలంగాణ బతుకమ్మ స్వరూపం. తెలంగాణ బతుకమ్మ జీవన విధానం. తెలంగాణ పండగల బతుకమ్మ మన జీవనశైలికి నిదర్శనం. కాని ఆంధ్రుకు బతుకమ్మ లేదు. తెలంగాణ బతుకమ్మను అవరవై ఏళ్లలో సీమాంధ్రులు గౌరవించింది లేదు. పూజించింది లేదు. పూలను కొలిచిందిలేదు. పూలతో ప్రకృతికి దగ్గరైంది లేదు. తెలంగాణకు పూలంటే దైవం. తెలంగాణకు పూలంటే ఒక జీవితం. సమాజాన్ని కాపాడే కల్పతరువుకు సంకేతం. తెలంగాణ బాషలో కొన్ని ప్రత్యేకతలున్నాయి. ఏ సమాజానికి సంస్కృతే ఆ వ్యవస్ధకు గొప్పది. అలాంటి వ్యవస్ధను ఆ సమాజంలో నివసించే రేవంత్‌ లాంటి వ్యక్తి నాశనం చేయాలని చూస్తే, ఆ ప్రజానికాన్ని మోసం చేయాలని చూస్తే తెలంగాణ గాలి కూడా క్షమించదు. అలాగే తెలంగాణ రేవంత్‌ చేసే రాజకీయాన్ని ఆహ్వానించదు. రేవంత్‌ రెడ్డి లాంటి తెలంగాణ ద్రోహిని ముందు పెట్టుకొని రాజకీయం చేస్తామంటూ కాంగ్రెస్‌పార్టీని ప్రజలు అసలే క్షమించరు. తెలంగాణ పిసిసి. అధ్యక్షుడయ్యాక ఇప్పటికే తెలంగాణలో అనేక చిచ్చులు పెట్టే ప్రయత్నం రేవంత్‌రెడ్డి చేశాడు. రైతులకు మూడు గంటల కరంటు చాలంటూ మొదలుపెట్టి, ఉమ్మడి పాలనే బాగుందనేదాకా అనేక నీతిమాలిన వ్యాఖ్యలు చేశాడు. తెలంగాణ ఆలయ భూములు అమ్మి, మైనార్టీ డిక్లరేషన్‌ అమలు చేస్తానని చెప్పి, సమజాంలో చిచ్చు రేపే ప్రయత్నం చేస్తున్నాడు. కాంగ్రెస్‌ అంటే హైదరాబాద్‌లో కర్ఫ్యూ. హైదరాబాద్‌లో హిందువులు, ముస్లింలు కలిసి వుంటే కాంగ్రెస్‌ రాజకీయం చెల్లదు. అలా కలిసి వుండడం కాంగ్రెస్‌ నచ్చదు. కొన్ని వందల సంవత్సరాలుగా కలిసి బుతుకుతున్న తెలంగాణ సమాజంలో చిచ్చుపెట్టిందే కాంగ్రెస్‌ పార్టీ. తెలంగాణ వచ్చిన తర్వాత గడచిన తొమ్మిదేళ్ల కాలంలో మళ్లీ మంచి రోజులను చూస్తున్నాం. తెలంగాణలో హిందూ ముస్లింల సఖ్యతను మళ్లీ కల్లారా చూస్తున్నాం. అలాంటి ప్రశాంతమైన వాతావారణాన్ని చెడగొట్టాలని చూసే రేవంత్‌రెడ్డి లాంటి వ్యక్తిని తెలంగాణ సమాజం తరిమేయాలి. అతన్ని నమ్మిన పార్టీని హుస్సేన్‌సాగర్‌లో ముంచేయాలి. అప్పుడుగాని తెలంగాణకు పట్టిన శనిపోదంటున్న చెన్నూరు ఎమ్మెల్యే బాల్కసుమన్‌, నేటి ధాత్రి ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావు తో కాంగ్రెస్‌ను కడిగిపారేశారు. కాంగ్రెస్‌ అసలు స్వరూపం వివరించారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే…
ఈ తరానికి కాంగ్రెస్‌ అంటే ఏమిటి?
ఆ పార్టీ ఎంత దుర్మార్గమైంది. రేవంత్‌ రెడ్డి లాంటి నాయకుడు తెలంగాణకు ఎంతో మోసకారి అన్నది తెలంగాణ సమాజానికి తెలియాల్సిన అవసరం వుంది. తెలంగాణ ఒకనాడు కోటి తరనాల వీణ. అలాంటి తెలంగాణను చెరపట్టినంత పనిచేసి, ఆంధ్రలో విలీనం చేసిన పార్టీయే కాంగ్రెస్‌పార్టీ. స్వాతంత్య్రం వచ్చిన తర్వత విముక్తికోసం తెలంగాణ సమాజం కోరుకుంటుంటే, దేశంలో విలీనం చేసినట్లే చేసి, ఆంధ్రాలో కలిపేసింది. నిజాం రాజ్యంలో పెనం మీద వున్న తెలంగాణ సమాజాన్ని ఆంధ్రతో కలిపి పొయ్యిలో వేసింది. తెలంగాణను ఆగం చేసింది. పైగా గడుసు పెల్లోడు లాంటి ఆంధ్రా చేతిలో,అమాయక అమ్మాయి తెలంగాణను పెడుతున్నాము. అంటూ సన్నాయి నొక్కులు నొక్కిన నెహ్రో చేసిన తొలి మోసం తెలంగాణకు శాపంగా మారింది. ఆనాటి నుంచి తెలంగాణ సమాజం అరిగోసడిరది. హైదరాబాద్‌ రాష్ట్రంగా వెలుగొందాల్సిన ప్రాంతాన్ని చీల్చి, సాంస్కృతిక విద్వంసం చేసిందే కాంగ్రెస్‌ పార్టీ. ఆంధ్రాతో ఎప్పుడూ తెలంగాణకు జీవన వైవిద్యమే..ఇప్పటికీ మహారాష్ట్రలోని మన పూర్వ ప్రాంతాలు, కర్నాకటలోని కొన్ని జిల్లాలలో తెలంగాణ సంస్కృతి కాపాడబడుతోంది. అక్కడి సమాజం ఇంకా తెలంగాణ యాసను, సంస్కృతిని కాపాడుకుంటున్నారు. కాని అరవైఏళ్లపాటు తెలంగాణతో కలిసిసాగి, తెలంగాణను విధ్వసం చేశారు. అందుకు ముఖ్య కారణం కాంగ్రెస్‌పార్టీ. ఇప్పుడు తగుదునమ్మా అని తెలంగాణ ఇచ్చింది మేమే..అని కొందరు..తెచ్చింది మేమే…అని చెప్పుకోవడానికి కూడా కాంగ్రెస్‌ నేతలు సిగ్గుపడడం లేదు. తెలంగాణ ద్రోహిని పార్టీ అధ్యక్షుడిని చేసుకొని, ఒకనాడు సోనియాగాంధీని అనరాని మాటలు అన్న రేవంత్‌ను నెత్తినపెట్టుకున్న కాంగ్రెస్‌ను ప్రజలు చీ కొడుతున్నారు. బాషా ప్రయుక్త రాష్ట్రాల కుట్రలో తెలంగాణను బలి చేసిందే కాంగ్రెస్‌పార్టీ. ఆంద్ర ప్రాంత నాయకులు తెలంగాణను దోచుకుంటుంటే సహకరించిందే కాంగ్రెస్‌ పార్టీ. కేవలం పదవుల కోసం చేతగాని దద్దమ్మల్లాగా చేతులు కట్టుకొని, పదవుల ఎర కోసం ఎదురుచూసిన తెలంగాణ నాయకులను లెక్కలోకి తీసుకోకుండా, సీమాంధ్రకు దోచిపెట్టినపార్టీయే కాంగ్రెస్‌. ఒకనాడు గొలుసు కట్టు చెరువులతో దేశంలోనే గొప్పగా సాగు సంపదను కలిగి వున్న ప్రాంతం తెలంగాణ. ప్రపంచంలోనే నైజాం ధనవంతుడుగా మారడానికి కూడా తెలంగాణసాగుసంపదే. అలాంటి తెలంగాణను , ఆంధ్రాలో విలీనం చేయడంతో తెలంగాణ సాగు ఆగమైంది. చెరువులు చెల్లాచెదురయ్యాయి. ఉమ్మడి పాలకుల నిర్లక్ష్యం తెలంగాణ సాగు చిన్నాభిన్నమైంది. నీటి వసతులు కరువై, తెలంగాణ ఎడారిగా మారింది. దీనంతటికీ కారణం కాంగ్రెస్‌ పార్టీ. ఒక ప్రాంతాన్ని గొప్పగా, మరో ప్రాంతంపై సీత కన్నేసి చెరబట్టినంత పనిచేసింది కాంగ్రెస్‌పార్టీ. రెండు తెలుగు రాష్ట్రాల విలీనానికి ముందు, మూడుకోట్ల రూపాయల మిగులు బడ్జెట్‌తో వున్న తెలంగాణ, రెండు కోట్ల లోటుతో ఏర్పాటైన ఆంధ్రలో కలిపారు. తెలంగాణకు ఆకలి కేకలు చూపించారు.
ఇప్పుడు తెలంగాణ పచ్చి వ్యతిరేకి రేవంత్‌రెడ్డిని ముందు పెట్టుకొని మళ్లీ శిఖండి రాజకీయం చేస్తోంది కాంగ్రెస్‌పార్టీ.
కాంగ్రెస్‌ చేస్తున్న ప్రచారం చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. వాళ్ల తెలివి తెల్లారినట్లే వుందని తిట్టుకుంటున్నారు. 24గంటల ఉచిత కరంటు ఇస్తున్న తెలంగాణకు వచ్చి, కర్నాటక కాంగ్రెస్‌ నేతలు ఐదుగంటల కరంటు ఇస్తామంటుంటే తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు తెల్లమొహం వేయాల్సివస్తోంది. అంటే తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు చెబుతున్నది నిజమే అని నమ్మాల్సి వస్తోంది. తాజాగా నిజామాబాద్‌ లో ప్రచారం చేసిన షబ్బీర్‌ అలీ 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ అంటే ఒక బల్బు, ఒక ప్యాన్‌, ఒక టివి. వుంటేనే ఇస్తామని, అంతకంటే ఎక్కువ వుంటే ఇవ్వమని తేల్చేశారు. ఎన్నికలు కాకముందే ఇన్ని అబద్దాలు ఆడుతున్న కాంగ్రెస్‌ను నమ్మితే నట్టెట ముంచడం ఖాయం. అయినా జాతీయ పార్టీలకు దేశమంతా ఒకే విధానం వుండాలి. కాని పూటకో వేషం వేసినట్లు, రాష్ట్రానికో విధానం అంటేనే కాంగ్రెస్‌ డొల్లతనం ఏమిటో అర్ధమౌతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *