Headlines

కాంగ్రెస్‌కు కర్రువాతే!

https://epaper.netidhatri.com/

`రేవంత్‌ రూపంలో పాతాలానికి కాంగ్రెస్‌ పతనమే.

`రైతుల మధ్య రేవంత్‌ చిచ్చు!

`మతాల మంటలో చలికాచుకునే కుట్ర?

`హిందూ, ముస్లిం తగవుల కోసం ప్రయత్నం?

`రేవంత్‌ చెప్పేవి పచ్చి అబద్దాలు… మోసపూరిత హామీలు.

`కౌలు రైతుకు సాయం సాధ్యం కాదని తెలుసు.

`ఓట్ల కోసం రైతుల మధ్య పేచీ చీకటికోణం.

`ధరణి తొలగించి ఆంధ్రా పెట్టుబడి దారులకు మేలు చేసే ప్రయత్నం.

`హైదరాబాదు చుట్టుపక్కల ఏ ఒక్క తెలంగాణ వ్యక్తికి భూమి లేదు.

`వారి భూముల కాపలా కోసమే…

`తెలంగాణలో ఆంద్రా భూమూలు కాపాడే ఎత్తు గడ.

`తెలంగాణ లో ఏ రైతు అందుకు ఒప్పుకోడు.

`తెలంగాణలో కొత్త పంచాయతీకి రేవంత్‌ పన్నాగం.

`కాంగ్రెస్‌ వస్తే రైతు బంధుకు రాంరాం.

`కాంగ్రెస్‌ వల్ల కుటుంబాలలో చిచ్చు.

`హిందూ ఆలయాల భూములు అమ్మకం కుదరని పని.

`హిందూ,ముస్లింల మధ్య మళ్లీ దూరానికి పునాది.

`మళ్ళీ కర్ఫూల కాలానికి నాంది.

`మైనారిటీ కోసం నాలుగు వేల కోట్ల కోసం దేవాలయాల భూములే కావాలా?

`పెన్షన్‌ పెంచే ముసుగులో ఏరివేతకు పన్నాగం.

`ఆసరా పెన్షన్ల కోతకు దారి.

`దివ్యాంగుల పెన్షన్లపైనా రేవంత్‌ నజర్‌.

హైదరాబాద్‌,నేటిధాత్రి:

కాంగ్రెస్‌కు ఇప్పటికే రెండు సార్లు కర్రు కాల్చి వాతలు పెట్టారు. మొదటిసారి తెలంగాణ ఇస్తామని ఆలస్యం చేసినందుకు పెట్టాల్సినంత వాత పెట్టారు. అయినా మారలేదు. మళ్లీ సీమాంద్రను వెంటేసుకొని వచ్చింది. సీమాంద్ర నాయకత్వం మోచేతి నీళ్లే తాగుతామని కలిసి తెలంగాణ ఆత్మగౌరవపార్టీని బిఆర్‌ఎస్‌ దించాలని కుట్ర పన్నింది. దాంతో 2018లో మళ్లీ ప్రజలు మరింత ఎర్రగా కాచ్చిన కర్రుతోనే కాల్చారు. అయినా ఇక కాంగ్రెస్‌ మారదు. మళ్లీ ఒకసారి గతం కన్నా ఎక్కువగా వాత పెడితే గాని మారేట్టులేదు. తెలంగాణ ప్రజలకు రైతుబంధు అన్నది ఏటా అందాల్సిన సమయంలో అందాలి. అందాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుకున్నది. రైతు బంధు అన్నది గత ఐదేళ్లుగా నిరంతరం అందుతున్న పధకం. దానిని ఎన్నికలకు ముడిపెట్టాల్సిన అవసర ంలేదు. దానిని ఎన్నికల నియమావళికి ముడిపెట్టాల్సిన అంశమే కాదు. అయినా ఆ మద్య రైతు బందును అడ్డుకునేందుకు కాంగ్రెస్‌ కుట్రపన్నింది. అప్పుడే కాంగ్రెస్‌ నిజ స్వరూపం బిఆర్‌ఎస్‌ నాయకులు బైట పెట్టారు. మంత్రి హరీష్‌రావు ఈ విషయంలో కాంగ్రెస్‌ కుటిల నీతిని ఆనాడే ఎండగట్టాడు. తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కమీషన్‌ను విజ్ఞప్తి చేయడంతో రైతు బంధు విడుదలకు గ్రీన్‌ సిగ్నల్‌ వచ్చింది. దాంతో కాంగ్రెస్‌లో ఓటమి గుబులు మొదలైంది. ఎలాగైనా రైతు బంధు ఆపాలని చూసింది. ప్రజలు ప్రభావితమౌతారని చెప్పి, ఎన్నికల కమీషన్‌కు ఉత్తరం రాసి ఆపించింది. నిజంగా ప్రజలు కాంగ్రెస్‌ను కోరుకుంటే ఎవరు ఆపినా ఆగరు. కాని ప్రజలు ప్రభావితమౌతారని వారిని కాంగ్రెస్‌ అవమానించింది. తెలంగాణ రైతాంగం ఆత్మగౌరవాన్ని కాంగ్రెస్‌ దెబ్బతీసింది. తెలంగాణ రైతులకు రైతు బంధు పడకుండా అడ్డుకున్నది. రైతు బంధు కోసం రైతులను బిఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎదరుచూసేలా చేయలేదు. కాని కాంగ్రెస్‌ ఎన్నికల నిబంధనలను అడ్డుపెట్టుకొని రైతులను ఇప్పుడే మోసం చేయడం మొదలుపెట్టింది. ఒకవేళ ఇలాంటి కాంగ్రెస్‌ను నమ్మితే రైతు బందు అన్నది ఇక ఆగిపోయినట్లే. ఒక్కసారి రైతు బందు ఆగితే ఇక రావడం కష్టమే. ఎందుకంటే కాంగ్రెస్‌ పొరపాటున అధికారంలోకి వస్తే ముందు రైతు బంధునే సమీక్షిస్తుంది.

రైతు బంధు కొందరి కుదించడం కోసం కొంత కాలం ఆపేస్తుంది.

అసలు రైతు బంధు అందుకుంటున్న భూములపై సర్వేలు అంటూ మొదలుపెడుతుంది. ధరణి పేరుతో అసలుకే రైతుబంధుకు ఎసరు తెస్తుంది. కౌలురైతుల పేరుతో రైతు బంధు పథకానికే తూట్లు పొడుస్తుంది. రైతులకు 24 గంటల కరంటు అవసరం లేదు. 3 గంటలు చాలు..అని చెప్పే కాంగ్రెస్‌ ఒకవేళ అధికారంలోకి వస్తే రైతు బంధు ముందు ముందర కాళ్ల బంధం వేస్తుంది. రేపటి పంటకు ఆటంకం కల్గిస్తుంది. రైతుకు పెట్టుబడి లేకుండా చేస్తుంది. ఇలాంటి కాంగ్రెస్‌ చేసే కుట్రలు అన్నీ ఇన్నీ కావు. కాంగ్రెస్‌ పార్టీకి రైతుల మీద ఏనాడు ప్రేమ లేదు. ఇప్పుడు కొత్తగా వస్తుందన్న నమ్మకం అసలే లేదు. ఎందుకంటే ఇప్పుడు రైతు బంధు ఆపిన కాంగ్రెస్‌పార్టీ రేపు ధరణి తొలిగించి,కొత్తగా పాస్‌బుక్‌లు మళ్లీ మంజూరుచేసి అందులో కౌలు కాలం జేర్చితే …ఇక అంతే..భూ యజమానులు..కౌలు రైతుల మధ్య చిచ్చు మొదలైట్లే. ఇప్పుడు రైతు తాను కౌలుకు ఇవ్వను. అంటే ఇంత కాలం నేను సాగు చేయలేదా? ఇప్పుడెందుకు ఇవ్వవు అనే పంచాయితీ మొదలౌతుంది. తమకు కౌలు పడకండా అడ్డుకుంటారా? మాకు భూమిని కౌలుకు ఇవ్వవా? అన్న కక్షలు పెరుతాయి. ఒకే ఊరిలో వుండే రైతులు ఒకరికొకరు శత్రువులౌతారు. ఇలా లేని పోని చిచ్చుపెట్టి రాజకీయాలు చేద్దామని రేవంత్‌ అనుకుంటున్నాడు. అంతే కాకుండా కౌలు అమలు చేయడంలో ఎవరికి రైతు బంధు, ఇవ్వాలి..ఎవరికి ఇవ్వకూడదన్నదానిపై ఒక నిర్ణయం తీసుకుంటామని కూడా రేవంత్‌ అన్నారు. అంటే ఒక వేళ కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే మందు ఆపే పధకం రైతు బంధే అవుతుందని ప్రజలు గమనించాలి.

రేవంత్‌ రాజకీయం మొత్తం భూముల చుట్టే తిప్పుతున్నాడు.

రైతులను ఆగం చేయాలనుకుంటున్నాడు. ప్రశాంతంగా వున్న పల్లెల్లో చిచ్చుపెట్టే ప్రయత్నంచేస్తున్నాడు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే మైనార్టీ డిక్లరేషన్‌ అమలకోసం తెలంగాణ ఆలయ భూములను విక్రయిస్తామని చెప్పడం అంటే తెలంగాణలో ప్రశాంతతను దెబ్బతీయడమే అవుతుంది. ఇప్పటి వరకు తెలంగాణలో గంగా జమున తహజీవ్‌ అలా సాగుతోంది. ఎంతో సామర్యపూర్వకమైన వాతావరణం పల్లెలో వుంది. హిందూ ముస్లిం బాయి, బాయి అనుకునేంత అందమైన వాతావరణం వుంది. దాన్ని చెడగొట్టేందుకు రేవంత్‌ కంకణం కట్టుకున్నట్లున్నాడు. ఒక సామాజిక వర్గ అభివృద్దికి ప్రభుత్వం నిధులు కేటాయించడం పరిపాటే. అందుకు బడ్జెట్‌ రూపకల్పనలో నిధులు చేర్చాల్సివుంటుంది. అది వదిలేసి మైనార్టీల డిక్లరేషన్‌ అమలు చేస్తామని, అందుకు ఆలయ భూములు విక్రయిస్తామని చెప్పడం అంత మూర్ఖత్వం ఏమైనా వుంటుందా? రేవంత్‌ చేసిన ఈ ప్రకటనను ముస్లింలు సైతం ఖండిరచారు. రెండురన్న లక్షల బడ్జెట్‌ వున్న తెలంగాణలో ముస్లిం డిక్లరేషన్‌ కోసం కేటాయిస్తామన్న రూ.4వేల కోట్లు లేకపోతాయా? అందుకు ఆలయ భూములు అమ్మాలా? అంటేనే ఇందులో ఏదో మతలబు వుంది. ప్రశాంతంగా వున్న తెలంగాణలో అలజడి రేపడం కోసమే రేవంత్‌ ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అందుకే మైనార్టీలు కాంగ్రెస్‌కు ఓటు వేయొద్దుని తీర్మానించాయి.

నిజానికి రేవంత్‌ రెడ్డి చెప్పే మాటలన్నీ అబద్దాలే..నీటి మీద రాతలే.. కౌలు రైతుకు సాయం సాధ్యం కాదని తెలుసు.
అయినా మభ్యపెట్టాలని చూస్తున్నాడు. రైతుల మద్యే చిచ్చుపెట్టాలని ప్రయత్నంచేస్తునాడు. ముస్లిం డిక్లరేషన్‌ పేరుతో హిందువులు, ముస్లిం మధ్య అగాధం పెంచాలని చూస్తున్నాడు. థరణి తొలగించి అటు రైతులకు, ఇటు కైలు రైతులకు మధ్య కొత్త పేచీకి తెరతీయాలని చూస్తున్నాడు. అంతే కాకుండా ఆంధ్రా కబ్జాదారులకు ప్రోత్సాహం కల్పించేందుకు తెరవెనకు కుట్రలకు తెరలేపుతున్నాడు. తెలంగాణ భూములను ఆంధ్రా రియల్టర్లకు,నాయకులకు అప్పగించేకుట్ర చేస్తున్నాడు. ఆంధ్రా ప్రాంతం వారి భూముల రక్షణ కోసమే ధరణి తొలగించాలని అనుకుంటున్నాడు. ఎందుకంటే ఆంధ్రా పెత్తందారులు కొన్న భూముల విషయంలో ఇబ్బందులు పడాల్సివస్తుంది. ఆ భూముల విషయంలో క్రయవిక్రయాలు ఇబ్బందులౌతాయి. అందుకే కౌలు రైతుల పేరు చెప్పి, ధరణిని రధ్దు చేసి, తెలంగాణ రైతులమీద ప్రేమ వున్నట్లు నటిస్తున్నాడు.
కాంగ్రెస్‌ వస్తే కొత్త పెన్షన్లు దేవుడెరుగు? వున్న పెన్షన్లు పోవడం ఖాయం.
ఎందుకంటే బిఆర్‌ఎస్‌ సానుభూతి పరులకే పెన్షన్లు అందుతున్నాయన్న ఆరోపణ చేసి, వాటిని సమీక్షిస్తామని ప్రకటించి, పెన్షన్లు ఆపేందుకు కాంగ్రెస్‌ పార్టీ వెనుకాడదు. అంతేకాకుండా తెలంగాణలో సుమారు 5లక్షలకు పైగా దివ్యాంగులకు పెన్షన్లు అందుతున్నాయి. అయితే దివ్యాంగుల విషయంలో బిఆర్‌ఎస్‌ కొంత సానుభూతితో 40శాతానికి తక్కువ వున్నా, వారికి పెన్షన్‌ అమలు చేస్తూ వస్తోంది. గతంలో దివ్యాంగులు ఎంత మొత్తుకున్నా పెన్షన్‌ ఇచ్చిన దాఖలాలు లేవు. వారి పెన్షన్‌లను కూడా సమీక్షించే అవకాశం వుందని కాంగ్రెస్‌ నేతలే అంటున్నారు. అందువల్ల కాంగ్రెస్‌ను ఆదరిస్తే, ఆదమర్చిపోయే లోపు చుక్కలు చూపించే ప్రమాదం లేకపోలేదు. రైతు బంధు ఇప్పుడే ఆపినవారు, రేపు ఆపకుండా వుంటారా? అధికారంలోకి రాకుముందే రైతులకు మూడు గంటల కరంటు చాలన్నవారు అంతకన్నా ఎక్కువ ఇస్తారా? మొత్తం మీద రైతాంగం ఆనందంగా వుండడం కాంగ్రెస్‌కు ఇష్టంలేదు. ప్రజలకు ఈ విషయం అర్ధమైంది. మరోసారి కర్రుకాల్చి వాత పెడితేగాని కాంగ్రెస్‌సక్కగ కాదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *