కాంగ్రెసోళ్లతోని కరంటిచ్చుడు కాదు! 

https://epaper.netidhatri.com/

ములుగు బిఆర్‌ఎస్‌ ఇంచార్జ్‌,ఎమ్యెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌ రెడ్డి నేటిధాత్రి ఎడిటర్‌ ‘‘కట్ట రాఘవేందర్‌ రావు’’ తో ‘‘చిట్‌ చాట్‌’’

`కాంగ్రెస్‌ కావాలా? కరంటు కావాలా!

`దీపావళి రోజున బెంగుళూరు లో కరంటు లేదు.

`కాంగ్రెసోళ్లు కరంటియ్యలేరు.

`రైతులు సల్లగుంటే కాంగ్రెస్‌ ఓర్వలేదు.

`కాంగ్రెస్‌ వస్తే మోటార్లు కాలిపోవుడు.

`ట్రాన్స్‌ ఫార్మర్లు చెడిపోవుడు.

`పొలాలు ఎండిపోవుడు.

`అర్థరాత్రి కరంటిస్తే రైతుల పానాలు పోవుడు.

`పదేండ్ల కింద కొడంగల్‌ లో ఎకరం భూమి10 వేలు.

`ఇప్పుడు కొడంగల్‌ లో ఎకరం భూమి కోటి రూపాయలు.

`పక్కనే కర్నాటక లో ఎకరం ఐదు లక్షలు.

`కొడంగల్‌ లో కరంటు 24 గంటలు.

`కర్నాటక లో కరంటు 4 గంటలు.

`పదేండ్ల కింద తెలంగాణలో గోసలు.

`కర్నాటక లో ఇప్పటికీ తిప్పలు.

`తెలంగాణ లో వెలుగులు.

`రైతు మోములో కాంతులు.

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

ఊహలు వేరు..నిజం వేరు. కాంగ్రెస్‌ కనే పగటి కలలు ఎప్పటికీ నెరవేరవు. ఇదీ జనం అనుకుంటున్న మాట. కాని కాంగ్రెస్‌ పార్టీకి లేని పోని హైప్‌ క్రియేట్‌ చేస్తున్న ఆంధ్రా మీడియా ఛానళ్లలో తప్ప ప్రచారం ఎక్కడా లేదు. జనం ఏమనుకుంటున్నారో ఆ ఛానళ్లకు అక్కర్లేదు. జనం మాట అసలే అక్కర్లేదు. హైదరాబాద్‌లో జరిగిన అభివృద్ది ఆ ఛానళ్లకు కనిపించదు. కాని పల్లెల్లో ముచ్చట్లు చెబుతుంటారు. అయితే ఆంధ్రా ఛానళ్లకు కాంగ్రెస్‌ అంటే మోజు కాదు. ప్రేమ కాదు. కేవలం చంద్రబాబు కోసం…చంద్రబాబు పరపతి కోసం..చంద్రబాబు చేసిందేమైనా వుందా? అదీ లేదు. ఉమ్మడి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పదిహేడు సంవత్సరాలు పాలన చేసింది. కాని తెలంగాణకు నీళ్లిచ్చిందా? ఇవ్వలేదు. కరంటు ఇచ్చిందా? లేదు. 45 ఏళ్లకు పైగా కాంగ్రెస్‌ పరిపాలించింది. కాంగ్రెస్‌ ఏమైనా చేసిందా? అంటే శూన్యం. 2004లో తెలంగాణ వాదంతో ముందుకొచ్చిన కాంగ్రెస్‌ పార్టీ అదికారంలోకి వచ్చింది. తెలంగాణలో రైతులు బోర్లు వేసుకోకుండా వాల్టా చట్టం తీసుకొచ్చింది. తెలంగాణను నమ్మించి మోసం చేసింది. తెలంగాణలో రైతులు ఇష్టం వచ్చిన రీతిలో బోర్లు వేసుకుంటే భూగర్జ జలాలు పడిపోతాయాని చెప్పి, రైతులపై కేసులు నమోదు చేసింది. అంతటి దుర్మార్గ చరిత్ర కాంగ్రెస్‌ది. తెలంగాణలో భూగర్జ జలాల మట్టం పడిపోతే పెంచేందుకు మార్గాలు అన్వేషించాల్సిన కాంగ్రెస్‌ పార్టీ రైతులు పొలాలకు నీళ్ల వినియోగంపై ఆంక్షలు పెట్టింది. బోర్లు తవ్వుకోకుండా కేసులు నమోదు చేసింది. తెలంగాణ సాగును ఆగం చేసింది. రైతులకు అర్ధరాత్రులు కరంటు ఇచ్చి, సాగంటే రైతుకు విసుగొచ్చేలా చేసింది. తెలంగాణ సాగును చిద్రం చేసింది. అసలే నీళ్లు లేక సాగు సాగని తెలంగాణలో ఎండాకాలం ఆరంభంలో అకాల వర్షాలు, గడగండ్ల చెడగొట్టు వానలతో రైతులు మరింత మునిగేవారు. నష్టపోయేవారు. అలాంటి రైతలను నాటి కాంగ్రెస్‌ ప్రభుత్వాలు ఏనాడు ఆదుకున్నది లేదు. అదే సీమాంధ్రలో చినుకు పడి పైరు నేలకొరిగినా నష్టపరిహారం ఇచ్చేది. తెలంగాణ రైతులంటే అంత చిన్న చూపు చూసేది. డిసెంబర్‌ 9 2009న ప్రకటించిన తెలంగాణను కాంగ్రెస్‌ వెనక్కి తీసుకున్నది. సీమాంధ్ర అంటే ప్రేమ కాంగ్రెస్‌కు వుండేది. తెలంగాణ మొత్తానికి చిన్న నీటి పారుదల అనే శాఖను పెట్టి, రూపాయి నిధులు ఇవ్వకుండా తెలంగాణను అపహాస్యం చేసేది. అంతే కాదు తెలంగాణను ఆగం చేస్తూనే మరో వైపు సాగు దండగ అని చంద్రబాబు నాయుడు లాంటి వారు మాట్లాడి రైతుల్లో ఆత్మవిశ్వాసం దెబ్బతీశారు…

కాంగ్రెస్‌ గాని, తెలుగుదేశం గాని అదికారంలో వున్న నాడు ఏనాడు 24 గంటల విద్యుత్‌ ఇచ్చింది లేదు. 

ఇప్పుడు ఒక వేళ ప్రజలు దయ తలిచి అధికారమిచ్చినా ఇస్తారన్న నమ్మకం లేదు. గతంలో ఏనాడు మాట వరుసకైనా కరంటు 24 గంటలు సరఫరా అయ్యింది లేదు. కాని తెలంగాణ వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి కేసిఆర్‌ అయిన వెంటనే మూడునెలల్లో కరంటు సమస్య శాశ్వత పరిష్కారం లభించింది. రైతాంగానికి కూడా 24 గంటల కరంటు అందుతోంది. 2014 తర్వాత ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు అక్కడ 24 గంటల కరంటు ఇవ్వలేకపోయాడు. ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్‌లో కరంటు కోతలతో ప్రజలు అల్లాడుతున్నారు. మరి తెలంగాణలో ఎంతటి ఎండాకాలమైనా కరంటు కోతలు అన్న పదం వినపడలేదు. రైతులకు కోత విధించలేదు. ఏనాడు ఎకరం ఎండిరది లేదు. దేశంలోనే రైతుకు సమృద్దిగానీరు, కరంటు ఇస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. రైతులు సంతోషంగా వుండడం చంద్రబాబుకు ఇష్టం లేదు. కాంగ్రెస్‌కు అసలే ఇష్టం లేదు. రైతు సంతోషంగా వుంటే చూసి చంద్రబాబు ఓర్వలేడు. అందుకే గత ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతిచ్చి ప్రజల చేత చీకొట్టించుకున్నాడు. అయినా చంద్రబాబు మారలేదు. ఆంధ్రప్రదేశ్‌లో ఇక నీ రాజకీయం చాలని ఏనాడో తరిమేశారు. అక్కడ స్ధానం లేకపోయే సరికి మళ్లీ తెలంగాణ మీద పడ్డాడు. 

 తెలంగాణ రాజకీయాలను కలుషితం చేసే కుట్రలకు తెరతీశాడు.

 సీమాంధ్ర మీడియాను వాడుకుంటున్నాడు. కాంగ్రెస్‌కు లేని హైప్‌ క్రియేట్‌ చేస్తున్నాడు. సరిగ్గా గత ముందస్తు ఎన్నికల్లో కూడా చంద్రబాబు ఇదే చేశాడు. తెలంగాణ అంటే పీకల దాకా అక్కసు వున్న ఆంద్రా ఆక్టోపస్‌ లగడపాటి రాజగోపాల్‌ గత ఎన్నికల్లో కేసిఆర్‌ పని అయిపోయిందని ప్రచారం చేశాడు. కాంగ్రెస్‌ గెలుస్తుందని ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేయాలని చూశాడు. కాని ఏం జరిగింది. తెలంగాణ సమాజం మొత్తం ముఖ్యమంత్రి కేసిఆర్‌ వైపు నిలిచింది. కాంగ్రెస్‌ను , తెలుగుదేశం పార్టీలను తెలంగాణ తరిమేసింది. ఇప్పుడు సరిగ్గా అదే జరగబోతోంది. బిఆర్‌ఎస్‌ మళ్లీ ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రాబోతోంది. తెలంగాణను అణిచి వేసి, తెలంగాణ చైతన్యాన్ని హేళన చేసిన చంద్రబాబును తెలంగాణ సమజం ఏనాడు నమ్మదు. చంద్రబాబు సాయం తీసుకుంటున్న రేవంత్‌ రెడ్డిని అసలే తెలంగాణ ప్రజలు నమ్మరు. రేవంత్‌రెడ్డి ఎప్పుడైతే చంద్రబాబు ముసుగు తొడుక్కున్నాడో అప్పటి నుంచే ఆయన పతనం మొదలైంది. తెలంగాణ సమాజం చీ కొట్టింది. తెలంగాణ వాదులు వుండే కొడంగల్‌లో ఓడిరచారు. సీమాంధ్రుల ప్రభావం వుండే చోట గెలిచి, ఇప్పుడు అదే రాజకీయం చేయాలని రేవంత్‌ చూస్తున్నాడు. 

పదేళ్ల క్రితం కొడంగల్‌లో ఎకరం భూమి కనీసం పది వేలు కూడా పలకేది కాదు. 

కాని నేడు కొడంగల్‌ నియోజకవర్గంలో ఎకరం కోటి రూపాయలు ధర పలుకుతోంది. ఇరవై నాలుగు గంట కరంటు వస్తోంది.. సాగుకు అవసరమైన నీరు అందుతోంది. ఒకనాడు ఎడారి లాంటి కొడంగల్‌ నేడు నీటితో కళకళలాడుతోంది. ఎక్కడ చూసినా కొడంగల్‌ పచ్చగా మారింది. మరి ఆ పక్కనే వున్న కర్నాటక భూములు ఎండిపోతున్నాయి. అక్కడ కరంటు లేక పంటలు ఎండిపోతున్నాయి. నీళ్లు లేక కర్నాటక భూములు బీళ్లు వారుతున్నాయి. కొడంగల్‌ బాగు పడడం రేవంత్‌కు ఇష్టం లేదు. చంద్రబాబుకు అసలే ఇష్టం లేదు. అందుకే మళ్లీ దొంగలంతా కలిసి వచ్చారు. తెలంగాణలో పాగా వేయాలని చూస్తున్నారు. నిజం చెప్పాలంటే కరంటు ఇచ్చుడు కాంగ్రెస్‌ వాళ్ల వల్ల కాదు. చంద్రబాబు వల్ల అసలే కాదు. కాలేదు. అందుకే బిఆర్‌ఎస్‌ పార్టీ కరంటు కావాలో..కాంగ్రెస్‌ కావాలో తేల్చుకోమని ప్రజలను కోరితే మాకు కేసిఆరే కావాలి అంటున్నారు. దీపావళి రోజున కర్నాకటలో కరంటు లేదు. బెంగుళూరు చీకట్లో దీపావళి చేసుకున్నది. కాంగ్రెస్‌ కరంటు ఇయ్యలేదని తేలిపోయింది. అసలు తెలంగాణలో ఎన్ని గంటల కరంటు వస్తుందో కర్నాటక రాష్ట్ర నేతలకు తెలిస్తే బాగుండేది. తెలంగాణకు వచ్చి రైతులకు 5 గంటల కరంటు ఇస్తున్నామని చెబుతుంటే, తెలంగాణ రైతులు నవ్వుకున్నారు. కాంగ్రెస్‌నేతల తెలివిని చూసి తిట్టుకున్నారు. కాంగ్రెస్‌ పాలన చూసిన తెలంగాణ ప్రజలకు గుర్తుకువస్తే ఆ పార్టీకి ఓటు కూడా వేయరు. అర్ధరాత్రిళ్లు కరంటు ఇచ్చి, రైతులన అరిగోస పెట్టిన కాంగ్రెస్‌కు తెలంగాణలో చోటు లేదు. ఆదరణ అసలే లేదు. పైకి కనిపిస్తున్న ్పప్రచారమంతా హంబక్‌…ఆంద్రా మీడియా సృష్టిస్తున్న కృత్రిమ హైప్‌…అంతే!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *