
మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్.
రామాయంపేట (మెదక్) నేటి ధాత్రి.
రామాయంపేట మున్సిపల్ పట్టణంలోని కెసిఆర్ కాలనీ లో నీటి ఎద్దడి తీవ్రంగా ఏర్పడినందున వెంటనే నివారణ చర్యలు చేపట్టారు. సుమారు 300 మీటర్ల పైపులైను జెసిబి ద్వారా తీసి కాలనీలో ఉన్నటువంటి రెండు బోర్ల నుండి రెండు మోటార్ల నుండి వాటర్ స్టోరేజ్ పంపు వరకు పైపుల ద్వారా వేసి పంపులో వాటర్ నింపి దాని ద్వారా ట్యాంకు ఎక్కిచ్చి అందరి ఇండ్లకు ఈరోజు మంచినీటిని పంపించడం జరిగింది. సమస్యకు పరిష్కారం చూపిన మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, కమిషనర్ ఏం దేవేందర్ లకు కాలనీ కమిటీ వాసులు విన్నవించడం జరిగింది. ఈ యొక్క సమస్య పరిష్కారం చేసినందుకు చైర్మన్, కమిషనర్ లకు కాలనీ కమిటీ వాసులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.