మంచిర్యాంకులు సాధించాలి
* విద్యార్థులకు స్నాక్స్ పంపిణీ చేసిన మాజీ ఎంపీపీ
* నోట్ పుస్తకాలు పంపిణీ చేసిన ఉత్తంగా
మేడ్చల్ జిల్లా ప్రతినిధి, నేటిధాత్రి 6 :
ఉపాధ్యాయులు చెప్పిన పాఠ్యాంశాలను శ్రద్ధగా చదువుకుని మంచి ర్యాంకులు సాధించాలని మాజీ ఎంపీపీ బొల్లెబోయిన చంద్రశేఖర్ యాదవ్ అన్నారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తుంకుంట 10వ తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతుల సందర్భంగా సోమవారం అయన విద్యార్థులకు స్నాక్ స్నాక్స్ అందజేశారు. రెండు నెలల వరకు ప్రతి రోజు సాయంత్రం 10వ తరగతి విద్యార్థులకు స్నాక్స్ అందించడం జరుగుతుందన్నారు. అనంతరం ఉత్తంగా ఫౌండేషన్ ద్వారా నోట్ బుక్స్ పంపిణీ చేసి 2025-26 విద్య సంవత్సరం 10వ తరగతిలో మొదటి ద్వితీయ తృతీయ స్థానం సాధించిన విద్యార్థినీ విద్యార్థులకు క్యాష్ ప్రైస్ అవార్డు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉత్తంగా ఫౌండేషన్ ప్రెసిడెంట్ వెంకటరమణ, ప్రధాన కార్యదర్శి నిరంజన్, రిటైర్డ్ ఎంపీడీవో బాల, రామకృష్ణ, పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకట రెడ్డి, ఉపాధ్యాయులు తిరుమలేష్, అన్నపూర్ణ ,నాగ శారద, శ్రీనివాస్ రెడ్డి ,వనజ, రజిని మంజుల, పద్మ, వరలక్ష్మి భాగ్యరేఖ ,శ్రీదేవి మహేష్ తదితరులు పాల్గొన్నారు.
