warangal prajanikaniki abinandanalu, వరంగల్‌ ప్రజానీకానికి అభినందనలు

వరంగల్‌ ప్రజానీకానికి అభినందనలు
సీపీ డాక్టర్‌ వి.రవీందర్‌
మూడు విడతలలో జరిగిన పరిషత్‌ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించడానికి సహకరించిన వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ ప్రజలకు వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ డాక్టర్‌ వి.రవీందర్‌ అభినందనలు తెలిపారు. వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలోని వరంగల్‌ అర్బన్‌, రూరల్‌, జనగామ జిల్లాల్లో మూడు విడతల్లో మొత్తం 36 మండలాల్లోని 36 జడ్పీటిసీ ఎన్నికలతోపాటు, 413ఎంపిటిసిలకు మూడు విడతల్లో నిర్వహించిన పోలింగ్‌ పూర్తిగా ప్రశాంతవంతమైన వాతావరణంలో నిర్వహించినట్లు తెలిపారు. ఈ సందర్బంగా పోలింగ్‌ నిర్వహించిన అన్ని గ్రామాల్లోను ఎలాంటి సంఘటనలు జరగకుండా పోలీస్‌ బందోబస్తు నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఎన్నికలు సజావు నిర్వహించేందుకు నాలుగు అంచెల భద్రతతో పోలీసు అధికారులు విధులు నిర్వహించడంతోపాటు, హోంగార్డ్‌ స్థాయి పోలీస్‌ అధికారి నుండి డిసిపి స్థాయి అధికారి వరకు అందరు పోలీస్‌ అధికారులు సమన్వయంతో పనిచేశారన్నారు. ముఖ్యంగా మంగళవారం నిర్వహించిన పోలింగ్‌ను సజావు నిర్వహించేందుకు ప్రతి గ్రామంలోని పోలింగ్‌ కేంద్రం వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేసినట్లు పోలీస్‌ కమిషనర్‌ తెలిపారు.
పోలింగ్‌ కేంద్ర సందర్శన
మూడవ విడత పరిషత్‌ ఎన్నికల సందర్బంగా గీసుగోండ మండలంలోని పోలింగ్‌ కేంద్రాన్ని పోలీస్‌ కమిషనర్‌ డాక్టర్‌ వి.రవీందర్‌ సందర్శించి పోలింగ్‌ కేంద్రంలో పోలీస్‌ బందోబస్తు ఏర్పాట్లను పోలింగ్‌ సజావుగా కొనసాగేందుకు పోలీసు అధికారులు తీసుకున్న చర్యలపై పోలీస్‌ కమిషనర్‌ ఈస్ట్‌జోన్‌ డిసిపి నాగరాజు, మామూనూర్‌ ఏసిపి శ్యాంసుందర్‌, గీసుగోండ ఇన్‌స్పెక్టర్‌ సంజీవరావుతో కలసి పరిశీలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *