ఏ.ఐ.ఎఫ్.బి రాష్ట్ర నాయకులు అందె బీరన్న
చేర్యాల నేటిధాత్రి…
దేశ, రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించేది ఓటు మాత్రమే. కాబట్టి డబ్బుకు, మధ్యానికి ఓటు అమ్ముకోకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలని, సరైన నేతలను ఎన్నుకుని నవ సమాజ స్థాపనకు అవకాశం కల్పించే ఓటు హక్కు అత్యంత విలువైనదని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర నాయకులు అందె బీరన్న పిలుపునిచ్చారు.
బుధవారం నాడు పార్టీ కార్యాలయంలో పాకాల ఎస్సాకు అధ్యక్షతన ఏర్పాటుచేసిన కార్యక్రమానికి రాష్ట్ర నాయకులు అందె బీరన్న పాల్గొని మాట్లాడుతూ….కుల, మత, ప్రాంత, లింగ, జాతి, భాష, అనే భేదం లేకుండా దేశంలో నివసించే 18 సంవత్సరాలు నిండిన పౌరులు అందరికీ భారత రాజ్యాంగం ఆర్టికల్ 326 ప్రకారం ఓటు కల్పించడం జరిగిందని, కావున జనగామ ప్రాంత అభివృద్ధికి ఓటు వెయ్యాలని, నిరంతరం ప్రజలలో వుండే నాయకుడిని గెలిపియ్యాలని వారు అన్నారు.అన్ని జిల్లాలో కంటే జనగామ జిల్లా అభివృద్ధికి నోచుకోలేదని, పేద ప్రజల పక్షాన నిలబడి కొట్లాడే నాయకుడుని గెలిపియ్యాలని అన్నారు. ఈ కార్యక్రమలో అఖిల భారత విద్యార్ధి బ్లాక్ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు పుల్లని వేణు, ఫార్వర్డ్ బ్లాక్ నాయకులు ఎర్రోళ్ల అఖిల్, ఆనందం, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.