వితంతువుల మనోభావాలను గౌరవించాలి
వితంతువుల మనోభావాలను సమాజంలోని ప్రతి ఒక్కరు గౌరవించాలని జయగిరి గ్రామ సర్పంచ్ బొల్లవేణి రాణి అన్నారు. ఆదివారం మండలంలోని జయగిరి గ్రామంలో గ్రామపంచాయితీ కార్యాలయంలో బాలవికాస ఆధ్వర్యంలో గ్రామాభివృద్ది కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ రాణి హాజరై మాట్లాడారు. గ్రామాన్ని పరిశుభ్ర గ్రామంగా తీర్చిదిద్దేందుకు గ్రామస్తులు సహకరించాలని అన్నారు. అదేవిధంగా ప్లాస్టిక్ వ్యర్థాల సమస్య నేడు అధికంగా ఉందని, దాని నివారణకు ప్రత్యేక చర్యలు చేపడతామన్నారు. అనంతరం ఈనెల 23వ తేదీన వితంతువుల దినోత్సవం సందర్భంగా గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ ఏలీమి రమేష్, పంచాయతీ కార్యదర్శి సురేష్, వార్డుసభ్యులు వెంకటేష్, రాజు, బాలవికాస ప్రతినిధులు బాబూరావు, రాజ్‌కుమార్, టిఆర్‌ఎస్ నాయకులు పిట్టల రాజు, కుమారస్వామి, కమిటీ అధ్యక్షుడు, సభ్యులు పాల్గొన్నారు.