vithanthu dinostavanni vijayavantham cheyali, వితంతు దినోత్సవాన్ని విజయవంతం చేయాలి

వితంతు దినోత్సవాన్ని విజయవంతం చేయాలి

ఈనెల 23న జరిగే అంతర్జాతీయ వితంతు దినోత్సవాన్ని విజయవంతం చేయాలని బాలవికాస ప్రతినిధి గోర్కటి రాజ్‌కుమార్‌ పిలుపునిచ్చారు. దుగ్గొండి మండలంలోని పొనకల్‌, రేబల్లె గ్రామాలలో ఆదర్శ గ్రామ నిర్మాణంలో భాగంగా బాలవికాస ఆధ్వర్యంలో ఈనెల 23న జరిగే అంతర్జాతీయ వితంతువుల దినోత్సవాన్ని ఉద్దేశించి గ్రామాలలో ర్యాలీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భర్త చనిపోయిన మహిళలకు బొట్టు, పూలు, గాజులు తీసివేయడం ప్రపంచంలో ఏ దేశంలో లేని మూఢాచారం భారతదేశంలోనే ఎందుకు ఉందని ప్రశ్నించారు. బాలవికాస గత 25సంవత్సరాల నుండి సభలు, సమావేశాలు ఏర్పాటుచేస్తూ అవగాహన కల్పిస్తూ సామజిక ఉద్యమం దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నామన్నారు. అతి చిన్నవయసులో ఉన్న వితంతు మహిళలు అవగాహన లేక ఆత్మహత్యలకు చేసుకుంటున్నారన్నారు. ఆదర్శ గ్రామాల సర్పంచ్‌లు మూఢ ఆచారాలను అరికట్టి ఆదర్శంగా నిలవాలని కోరుతూ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పొనకల్‌ సర్పంచ్‌ బొమ్మగాని ఊర్మిళ, రేబల్లె సర్పంచ్‌ గటికే మమత, భాగ్యలక్ష్మి, సుజాత, భాగ్య, సమత, కవిత, సరస్వతి, లలిత, రాజమణి, సంధ్య, కోమల, రాజక్క, అరుణలతోపాటు పలువురు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *