ప్రసాదంలో వాడే నెయ్యి నాణ్యత పై అధికారులు దృష్టి పెట్టాలి – భక్తులు
వేములవాడ నేటిధాత్రి
తిరుమల లడ్డులో కల్తి నెయ్యి వ్యవహారం రాష్ట్రమంతటా చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో యాదాద్రి ఆలయ అధికారులు సైతం నెయ్యి వ్యవహారంలో అప్రమత్తమయ్యారు. లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో లడ్డు తయారీకి వినియోగించే నెయ్యిని హైదరాబాద్లోని ఓ ల్యాబ్ కు పంపారు. అలాగే వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో లడ్డుల తయారీలో వినియోగించే నెయ్యిని కూడా ల్యాబ్ కు పంపించి పరిశోధించాలని పలువురు భక్తులు కోరుతున్నారు. కల్తీ నెయ్యి వ్యవహారం రాష్ట్రమంతటా చర్చనీయాంశంగా మారడంతో ఆలయాల్లో అమ్మే ప్రసాదాల నాణ్యత పై అధికారులు దృష్టి పెట్టాలని భక్తులు కోరుతున్నారు..