మరిపెడ మండల ఉపాధ్యాయ జేఏసి.
మరిపెడ నేటి ధాత్రి.
ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో 25 ఉత్తర్వులను వెంటనే సవరించాలని మరిపెడ ఉపాధ్యాయ జేఏసీ నాయకులు మధ్యాహ్న భోజన విరామ సమయంలో నిరసన కార్యక్రమం చేపట్టారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఉపాధ్యాయ పోస్టులను నిర్ణయించడం సబబు కాదని అన్నారు. ప్రతి ప్రాథమిక పాఠశాలలో తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉండేవిధంగా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ప్రాథమిక పాఠశాలలో గుణాత్మక విద్యను పెంపొందించడానికి మరియు ఒకటి నుండి ఐదు తరగతులకు 18 సబ్జెక్టులు బోధించడం కోసం ఉపాధ్యాయుల సంఖ్యను పెంచాలి తప్ప కుదించడం సరికాదని అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు కీసర రమేష్ రెడ్డి,హేమ్లా, లింగాల మహేష్ గౌడ్,జనార్ధనచారి,మంగు హఫీజ్, కరుణాకర్,వెంకన్న,మంగిలాల్ ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.