వాలీబాల్ కిట్ పంపిణీ
వాజేడు గ్రామ యూత్‌కు వాలీబాల్ కిట్‌ను ఆ గ్రామ ఆదివాసీ ఉపాధ్యాయులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆదివాసీ ఉపాధ్యాయులు పీర్ల కృష్ణబాబు, బోదెబోయిన పరమేశ్వరరావు మాట్లాడుతూ వాలీబాల్ క్రీడలో రాణించి వాజేడు గ్రామానికి మంచిపేరు తీసుకురావాలని కోరారు. అదేవిధంగా క్రీడల్లో పడి చదువును నిర్లక్ష్యం చేయవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో వాజేడు గ్రామ యూత్ సభ్యులు ఆలం శివ, బంధం రాంబాబు, బొడ్డు కృష్ణ, తోలెం దినేష్, జాక ప్రవీణ్, చిడెం రవికుమార్, చిడెం నాగేంద్ర, ఆలం కృష్ణ తదితరులు పాల్గొన్నారు.