ఉపాధిహామీ పనులు బేష్
హసన్పర్తి మండలంలోని జయగిరి గ్రామంలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులు జోరుగా సాగుతున్నాయని ఫీల్డ్ అసిస్టెంట్ బుర్ర శ్రీధర్, ఎపిఓ విజయలక్ష్మి తెలిపారు. ఉదయం 6గంటల నుంచి 10గంటల వరకు పనులు చేస్తున్నారని, ఎండలు ఎక్కువగా ఉండటంతో ఇంటి దగ్గరనే ఉండి గ్రామంలో ప్రతి ఒక్కరు పనులకు వస్తున్నారు. వందలమందికి పని దొరకడం వలన పనులకు వచ్చిన వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. గ్రామంలో ఉన్న ఫీల్డ్ అసిస్టెంట్లు, సూపర్వైజర్లు, ఎపిఓలు గుర్తించి ఇప్పటి వరకు సరిపడా పనిదినాలు పూర్తి చేస్తున్నారని అన్నారు. చెరువుల పూడికతీతలు, నర్సరీ పనులు జోరుగా సాగుతున్నాయని, కూలీలకు ఎండదెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పారు. ఉదయం 6గంటల నుంచి 10గంటల వరకు పనులు చేస్తున్నట్లు తెలిపారు.