శేఖపూర్ లో శ్రావణమాసం ముగింపు: భజనలు, అన్నదానం
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ మండలం శేఖపూర్ గ్రామంలో శ్రావణమాసం పురస్కరించుకొని ప్రతిరోజు భజనలు, కీర్తనలు, హనుమాన్ చాలీసా పారాయణం ఘనంగా జరిగాయి. శ్రావణమాసం ముగింపు అమావాస్య సందర్భంగా శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో అభిషేకాలు, పూజా కార్యక్రమాలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించిన అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
