జహీరాబాద్ నేడు డయల్ యువర్ డిపో మేనేజర్
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ ఆర్టీసీ డిపో మేనేజర్, స్వామి, శనివారం ఉదయం 10 నుంచి 11 గంటల వరకు ‘డయల్ యువర్ ఆర్టీసీ డిపో మేనేజర్’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆర్టీసీకి సంబంధించిన సమస్యలు, సూచనలను 99592 26269 నంబర్కు ఫోన్ చేసి తెలియజేయవచ్చని పేర్కొన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.