చేర్యాల నేటిధాత్రి..
సిద్దిపేట జిల్లా నూతనంగా ఎన్నికైన మహిళా శిశు సంక్షేమ శాఖ జిల్లా అధికారి డి డబ్ల్యు ఓ గా అదనపు బాధ్యతలు చేపట్టిన శారదా ని ఈరోజు జిల్లా కార్యాలయం లో సిద్దిపేట జిల్లా టిఎన్జీవో యూనియన్ అంగన్వాడీ టీచర్లు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపి శాలువాతో ఘనంగా సత్కరించడం అయినది… ఇందులో భాగంగా అంగన్వాడి సెంటర్ల పరిధిలో ఉన్న సమస్యలు వారికి తెలపడం అయినది. దానికి వారు సానుకూలంగా స్పందించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పడం జరిగింది … ఈ కార్యక్రమంలో తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి పుష్ప,,జిల్లా ఉపాధ్యక్షురాలు కృష్ణవేణి,, ఈసీ మెంబర్ పద్మ, చేర్యాల ప్రాజెక్టు అధ్యక్షురాలు అరుణ, సరోజిని,సుజాత, అనిత మొదలగు వారు పాల్గొనడం జరిగింది..