జైపూర్, నేటి ధాత్రి:
రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో గ్రూప్ -1 ప్రిలిమినరీ పరీక్షకు పోలీసు శాఖ తరపున్న అన్నిరకాల భద్రత పరమైన ఏర్పాట్లు చేసినట్లు సీపీ ఎం. శ్రీనివాస్ తెలిపారు. బయోమెట్రిక్ సిస్టంతో పూర్తి పారదర్శకంగా పరీక్షలు జరగనున్నాయని, పరీక్ష కేంద్రాల్లోకి ఎలాంటి ఎలక్ట్రాన్రిక్ అనుమతి లేదన్నారు. ఉదయం 10 గంటలకు ఒక్క నిమిషం ఆలస్యమైన పరీక్ష కేంద్రంలోకి అనుమతి లేదని స్పష్టం చేశారు.