రామడుగు, నేటిధాత్రి:
కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెలిచాల గ్రామానికి చెందిన తాళ్లపల్లి సత్యమ్మ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం శాత్రాజుపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయురాలుగా విధులు నిర్వహిస్తున్నారు. పాఠశాలలో తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు ముగించుకొని ఇంటికి వస్తున్న సమయంలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా సత్యమ్మ కుటుంబసభ్యులను వెలిచాల గ్రామంలోని వారి ఇంటికి వెళ్లి పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపిన చొప్పదండి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే సుంకె శంకర్. ఈకార్యక్రమంలో జిల్లా రైతుబంధు సమితి సభ్యులు వీర్ల సంజీవరావు, మాజీ సర్పంచ్ రవీందర్ రావు, తదితరులు పాల్గొన్నారు.