గణపురం నేటి ధాత్రి
గణపురం మండలం బుద్ధారం గ్రామంలో ఎస్సీ కాలనీ మూడవ అంగన్వాడి సెంటర్ టీచర్ ఆలూరి కోమల ఆధ్వర్యంలో బడిబాట కార్యక్రమం చేయడం జరిగింది తల్లులు పిల్లలతో పాటు ర్యాలీ తీస్తూ మూడు సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు అంగన్వాడికి రావాలని అంగన్వాడీ వచ్చే పిల్లలకు ఒక పూట సంపూర్ణ భోజనంతో పాటు ఆటపాటలతో విద్యను అందించడం జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో ఆయా సమ్మక్క తల్లులు శృతి శ్రీలత ముత్తమ్మ పిల్లలు ప్రియాన్సీ వరుణ్ కుమార్ పాల్గొన్నారు