నల్లగొండ జిల్లా, నేటి ధాత్రి:
భువనగిరి పార్లమెంటు ఎన్నికల్లో సిపిఎంను ఆదరించి ఓట్లేసిన ప్రజలకు, మున్సిపల్ కార్మికులకు,గ్రామపంచాయతీ కార్మికులకు,అంగన్వాడి సిబ్బంది,ఆశాలు,వివో ఏలు,మధ్యాహ్న భోజన కార్మికులకు, మిషన్ భగీరథ కార్మికులకు, అహర్నిశలు శ్రమించినకార్యకర్తలకు, మీడియా ప్రతినిధులకు సిఐటియు మండల కన్వీనర్ జెర్రిపోతుల ధనుంజయ గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు. శుక్రవారంఆయన విలేకరులతో మాట్లాడుతూ, దేశంలో బిజెపి అనుసరిస్తున్నమతోన్మాదం,మహిళలపై దాడులు, మేధావులపై నిర్బంధం,ఆప్రజాస్వామికపరిపాలనబిజెపి అనుసరిస్తుందన్నారు.ప్రతినిత్యం పెరుగుతున్నచమురు, గ్యాస్ నిత్యవసర వస్తువులధరలు పెంచి, పేద ప్రజలపై భారం మోపిందన్నారు.ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేస్తూ, కార్పొరేట్ సంస్థలకుకట్టబెడుతున్నారనిఆయన అన్నారు.. సిపిఎం పార్టీ ప్రజల పక్షాన నిర్వహించిన పోరాటాలను ప్రజలకు వివరించామనిఆయన తెలిపారు.గెలుపోటములతో పని లేకుండా భవిష్యత్తు కాలంలో ప్రజా సమస్యల కోసం నిరంతరం పోరాడుతామనివారు తెలిపారు.చండూరు మండలంలో ప్రభుత్వ జూనియర్ కాలేజ్ ఏర్పాటు చేయాలనిఆయన అన్నారు.చండూరు ప్రభుత్వ ఆసుపత్రిలోమౌలిక వసతులు లేకరోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారనిఆయన ఆవేదన వ్యక్తం చేశారు.మొన్న జరిగిన పార్లమెంటు ఎన్నికల్లోఓటు వేసినప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.