నర్సంపేట, నేటిధాత్రి :
త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల ప్రక్రియ శనివారం రెండో రోజుకు చేరుకోగా ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారిని ఆర్డిఓ కృష్ణవేణి తెలిపారు. దుగ్గొండి మండలం చంద్రయ్యపల్లి గ్రామానికి చెందిన ముస్కే అమర్, అదే గ్రామానికి చెందిన నూనె అనిల్ కుమార్, నెక్కొండ మండలం తోపన పెళ్లికి చెందిన భూషబోయిన సురేష్ లు స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు వేసినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.