BJP Demands Fulfillment of Promises
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలి.
#పరిపాలనలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం విఫలం.
#బిజెపి మండల పార్టీ అధ్యక్షుడు తడుక వినయ్ గౌడ్.
నల్లబెల్లి, నేటి ధాత్రి:
రెండున్నర ఏండ్ల కాంగ్రెస్ ప్రభుత్వ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలన పూర్తిగా విఫలం అయిందని బిజెపి మండల పార్టీ అధ్యక్షుడు తడుక వినయ్ గౌడ్ అన్నారు. మంగళవారం రాష్ట్ర పార్టీ పిలుపుమేరకు గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడంతో మండల పార్టీ ఆధ్వర్యంలో తహసిల్దార్ ముప్పు కృష్ణకు వినతి పత్రం అందజేశారు. ఈ మేరకు వినయ్ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు అనేక హామీలను ఇవ్వడం జరిగింది కానీ ప్రభుత్వం ఏర్పడి రెండున్నర ఏండ్లు కావస్తున్న ఇప్పటివరకు ఒక్క హామీ కూడా పూర్తిగా అమలు చేయలేదని. ముఖ్యంగా యువతకు జాబ్ క్యాలెండర్, నిరుద్యోగ భృతి, వృద్ధప్య, వితంతు, దివ్యాంగులకు పెన్షన్లు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, పేదలకు గృహ నిర్మాణ పథకం, రైతులకు రైతు భరోసా, భూ సమస్యల పరిష్కారం వంటి అనేక హామీలు ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పటికీ హామీలు అమలు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు రైతు భరోసా సమయానికి అందకపోవడంతో రైతులు తీవ్రమైన ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నారని. పంట పెట్టుబడుల కోసం అప్పులపై ఆధార పడవలసిన పరిస్థితి రైతుకు నెలకొందని ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్ర లేచి రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని లేదంటే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రంగాపురం గ్రామ సర్పంచ్ ఓరుగంటి మాధురి రాజు, జిల్లా కౌన్సిల్ మెంబర్ బొద్దిరెడ్డి ప్రతాపరెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి ఈర్ల నాగరాజు, ఉపాధ్యక్షుడు బత్తిని కుమారస్వామి, నాయకులు సింగిరెడ్డి యాదగిరి, ఓదెల అశోక్, మురికి మనోహర్, వల్లే పర్వతాలు, బోట్ల ప్రతాప్, కొండ్లె రమేష్, క్రాంతి కుమార్, నరేష్, అనిల్, మధు, వీరన్న తదితరులు పాల్గొన్నారు.
