పేదవాడికి నీడ నివ్వడమే ప్రధాన లక్ష్యం
కాంగ్రెస్ మండల అధ్యక్షుడు దొడ్డ బాలాజీ
ముత్తారం :- నేటి ధాత్రి
ముత్తారం మండలంలోని అడవి శ్రీరాంపూర్ గ్రామానికి చెందిన మూగ అశ్విని కిషన్ కు ఇందిరమ్మ ఇల్లు మంజూరు కావడం జరిగింది . ఇట్టి ఇంటికి స్లాబ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు దొడ్డ బాలాజీ పాల్గొని ఇంటి యజమానులకు శుభాకాంక్షలు తెలియజేసారు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసినందుకు మూగ అశ్విన్ కిషన్ ఐ టి శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు కి కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్బంగా మండల అధ్యక్షుడు దొడ్డ బాలాజీ మాట్లాడుతూ ప్రతి పేదవాడికి నీడ నివ్వడమే ప్రధాన లక్ష్యంగా మంత్రి ఎనలేని కృషి చేస్తున్నారని తెలిపారు ఈ కార్యక్రమం లో ముత్తారం కాంగ్రెస్ సీనియర్ నాయకులు మూగ రవి. ఆకోజు అశోక్ మూగ సంపత్. మండల రాజు పాండవుల స్వామి తదితరులు పాల్గొన్నారు
