కబ్జా కు గురైన ఎస్సారెస్పీ కెనాల్ కాల్వ…

https://netidhatri.com/wp-content/uploads/2025/11/download-2025-11-10T144444.779.wav?_=1

 

 

కబ్జా కు గురైన ఎస్సారెస్పీ కెనాల్ కాల్వ

ఎస్సారెస్పీ కాలువ కబ్జా చేసిన ప్రాంతాన్ని పరిశీలించిన అధికారులు

* ఎస్ ఇ, రామకృష్ణ,
* ఈ ఈ సోలమన్ రాజ్.

మరిపెడ నేటిధాత్రి

 

మహబూబాబాద్ జిల్లాలో బీడు ప్రాంతంగా పేరున్న డోర్నకల్ నియోజకవర్గ ప్రాంతాన్ని ఎస్సారెస్పీ కాలువల ద్వారా గోదావరి జలాలను తెచ్చి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసి రైతాంగం బాధలను దూరం చేసేందుకు నాటి ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి,మొదలు ఈ ప్రాంత మాజీ శాసనసభ్యులు రెడ్యానాయక్ వరకు అవిరామంగా కృషి చేసి రైతులను ఒప్పించి భూ సేకరణ చేసి కాలువలను తవ్వించి సాగునీరును తెచ్చారు. వారి దూరదృష్టి, ఉన్నతాశయాలకు చేరే విధంగా ఆ ఎస్సారెస్పీ డిబిఎం 60 నుంచి 20 ఆర్ మెయిన్ కెనాల్ కాలువను ఆక్రమించడమే కాకుండా చివరి రైతులకు నీరందకుండా చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరిపెడ మండలం లో ఆర్లగడ్డ తండా , ఎలమంచి తండా, వెంకంపాడు, రూప్సింగ్ తండా వరకు ఎస్సారెస్పీ డిబిఎం 60 నుంచి 20 ఆర్ కెనాల్ ద్వారా నీరు మైసమ్మ కుంటకు చేరాలి కొంతమంది దుండగులు చేసిన ఈ ఆక్రమణలతో చివరి భూములకు సాగునీరు అందక తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు వాపోయారు,ఫిర్యాదు చేసినప్పటికీ ఆ ఆక్రమణలను నిరోధించి, రైతాంగనీకి న్యాయం చేయాలని వారు కోరారు, సోమవారం అధికారులు,ఎస్సారెస్పీ కాలువను పర్యవేక్షించారు. తక్షణమే కాలువలను ఆక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు, ఈ కార్యక్రమంలో డి ఈ సంజీవ, ఏ ఈ నరేంద్రబాబు, 20 ఆర్ ఎస్సారెస్పీ కెనాల్ వర్క్ ఇన్స్పెక్టర్ గూగులోత్ వెంకన్న, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version