చివరి తేదీ.. వెంటనే అప్లై చేసుకోండి..
ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన (PMKVY) కార్యక్రమంలో భాగంగా డ్రైవింగ్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటుకు ఈ నెల 13వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని ఇన్‌చార్జి ఉపరవాణా కమిషనర్ ఎం. వీర్రాజు ఒక ప్రకటనలో తెలిపారు. నైపుణ్యంతో కూడిన డ్రైవింగ్ స్కిల్స్ ..
ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన (PMKVY) కార్యక్రమంలో భాగంగా డ్రైవింగ్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటుకు ఈ నెల 13వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని ఇన్‌చార్జి ఉపరవాణా కమిషనర్ ఎం. వీర్రాజు ఒక ప్రకటనలో తెలిపారు. నైపుణ్యంతో కూడిన డ్రైవింగ్ స్కిల్స్ అభివృద్ధి చేయడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సాయంతో డ్రైవింగ్ ట్రైనింగ్ సెంటర్లు ఏర్పాటు చేయడమే ఈ పథకం ఉద్దేశమన్నారు. ఇందులో భాగంగా 10 లక్షల జనాభాకు ఒక డ్రైవింగ్ ట్రైనింగ్ సెంటర్ చొప్పున మంజూరు చేసేందుకు నిర్ణయించడమైందన్నారు. ఈనెల 13వ తేదీన సాయంత్రం 5 గంటలలోపు ఆసక్తిగల అభ్యర్థులు డీపీఆర్ కాపీలను, ఇతర అటాచ్‌మెంట్లను ఉపరవాణా కార్యాలయం వైఎస్ఆర్ కడప జిల్లాలో ఇవ్వాల్సి ఉందన్నా రు.ఇందుకు కావాల్సిన అర్హతలు ఆసక్తిగల సంస్థ ఎంజీవో, ట్రస్ట్, కోఆపరేటివ్ సొసైటీ, తయారీదారుడు, ఫార్మ్ఆయి ఉండాలన్నారు. ఎన్జీవో అయితే తప్పనిసరిగా దర్పం పోర్టల్‌లో రిజిస్టర్ అయి ఉండాలన్నారు. ఈ సంస్థ గత మూడు సంవత్సరాల ఆడిట్ రిపోర్ట్స్, టర్నోవర్ సర్టిఫికెట్లు అందించాలన్నారు. ఇటువంటి సంస్థకు సొంతంగా లేదా కనీసం పది సంవత్సరాల లీజు కలిగిన రెండు ఎకరాల స్థలం, సిమ్యులేటర్, ట్రైనింగ్ వాహనాలు, వర్క్‌షాపు, రెండు క్లాస్ రూమ్స్, ఇంటర్నెట్, తదితర సదుపాయాలు ఉండాలన్నారు. మరిన్ని వివరాలకు రవాణా శాఖ వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.
