
చిట్యాల నేటి ధాత్రి :
చిట్యాల మండల కేంద్రంలో అంబేsద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షుడు సరిగొమ్ముల రాజేందర్ అద్యక్షతన జరిగిన సమావేశంలో రాష్ట్ర ఆర్గనైజింగ్ లు పాల్గొని మాట్లాడుతూ గత సంవత్సరం కురిసిన అతీ భారీ వర్షాలకు రాష్ట్ర వ్యాప్తంగా చెరువులు కుంటలు డిబిఎం 38 కాలువలు తెగి నీళ్ళు లేకుండా పోయి రైతులు వేసిన పంటలు పండక నానా ఇబ్బందులకు గురయ్యారని ఆవేదన వ్యక్తంచేశారు. పంటలు పండక పోవడం వల్ల నిత్యావసర వస్తువుల ధరలు పెరగడం వలన రైతులు ప్రజలు కొనుగోలు చేయక సరియైన తిండి లేక అనేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.అతి భారీ వర్షాలకు తెగిన చెరువులు కుంటలు కాలువలు కొన్ని ప్రాంతాల్లో మరమత్తులు పనులుచేపట్టారు .*ఇప్పటికైన సంబంధించిన రాష్ట్ర జిల్లా మండలాల అధికారులు మిగతా ప్రాంతాలలో కూడా మరమత్తు పనులను వెంటనే చేపట్టాలని కోరారు, ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం జిల్లా సాంస్కృతిక కార్యదర్శి జన్నే యుగేందర్ సంఘం జిల్లా కార్యదర్శి గుర్రపు రాజేందర్ అంబేద్కర్ సంఘ నాయకులు పాల్గొన్నారు.