చలి మొదలైంది.. గరం కోట్లు ఇవ్వరా.. ?
సిఐటియు బ్రాంచ్ కార్యదర్శి గుల్ల బాలాజీ
శ్రీరాంపూర్,నేటి ధాత్రి:
సింగరేణిలో ప్రతి సంవత్సరం ఇవ్వవలసిన వాన,గరం కోట్లు ఈసారి కూడా తీవ్రమైన ఆలస్యానికి గురవడం, యాజమాన్యం నిర్లక్ష్యానికి నిదర్శనంగా ఉందని సిఐటియు బ్రాంచ్ కార్యదర్శి గుల్ల బాలాజీ మంగళవారం ప్రకటనలో విమర్శించారు. చలికాలం ప్రారంభమై ఇన్ని రోజులు గడిచిన ఇప్పటికీ కోట్లు పంపిణీ చేయకపోవడం, అలాగే గుర్తింపు,ప్రాతినిధ్య సంఘాలు ఇప్పించకపోవడంలో వారి వైఫల్యాలు స్పష్టమవుతున్నాయని అన్నారు.తీవ్ర చలిలో పనిచేసే ప్రదేశాలను దృష్టిలో ఉంచుకోవాలని,గరం కోట్లు అత్యవసరమని సంస్థ వెంటనే పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు.అలాగే కార్మికుల సెల్ ఫోన్లు,వస్తువులు,హెల్మెట్ లు భద్రపరుచుకోవడానికి అన్ని గనుల మీద లాకర్లను ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేశారు.ఇప్పటికైనా యాజమాన్యం కార్మికుల సంక్షేమంపై దృష్టి పెట్టాలని ఈ సందర్భంగా తెలిపారు.
