దక్షిణ మధ్య రైల్వే అధికారులు తీరు మార్చుకోవాలి
మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎండీ సాహెబ్ హుస్సేన్
వీణవంక ,(కరీంనగర్ జిల్లా).
నేటి ధాత్రి:గత 9 నెలల కాలం నుండి దక్షిణ మధ్య రైల్వే అధికారులు కాజీపేట – బల్లార్షా సెక్షన్లలో ట్రాక్ మరమ్మతుల పేరుతో మూడవ లైను వేస్తున్నామని కాలయాపన చేస్తూ పండుగల వేల రైళ్లు రద్దు చేయడం వల్ల రైల్వే ప్రయాణికులు, తీవ్ర ఇక్కట్లతో పాటు, ఆర్థిక ఇబ్బందులు, ప్రయాణ అలసటలు ఎదుర్కొంటున్నారు
తెలంగాణ రాష్ట్రంలో అతి పెద్ద పండుగ బతుకమ్మ,దసరా పండగల ముందు రైలు రద్దు చేయడం సిగ్గుచేటు
ఇకనైనా రైల్వే అధికారులు ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని దక్షిణ మధ్య రైల్వే అధికారులు పండుగల వేల రైలు రద్దు చేయడం అధికారులు తీరు మార్చుకోవాలి మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఎండీ సాహెబ్ హుస్సేన్ ఒక ప్రకటనలో అన్నారు.