
BRS party
ప్రతి కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది
ములుగు జిల్లాలో బీఆర్ఎస్ పార్టీలో ఎలాంటి విబేధాలు లేవు
ఎవరు పని చేసిన పార్టీ కోసమే
ప్రతి కార్యకర్తలకు అండగా ఉంటాము
బీఆర్ఎస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మణ్ బాబు
మంగపేట నేటి ధాత్రి
మంగపేట మండలంలో విస్తృతంగా పర్యటన చేసిన ములుగు జిల్లా అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మణ్ బాబు మంగపేట మండలంలో కొత్తమల్లూర్ గ్రామంలో ఇటీవల వేడినీళ్లు పడి ఒళ్ళు కాలిపోయిన వర్షిత (12) ను మరియు మహిళా కార్యకర్తరాలు మాటూరి నిర్మల (37) ఇటీవల కిడ్నీ ఆపరేషన్ చేయించుకొని ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న వారినీ పరామర్శించి 5వేల రూపాయిలు ఆర్ధిక సహాయం అందించారు,
అనంతరం రాజుపేట గ్రామంలో నూతన లక్ష్మి నరసింహ లాడ్జ్ నీ ప్రారంభించరు, అదే విధంగా ములుగు యూత్ జిల్లా ప్రధాన కార్యదర్శి బడిశా నాగరమేష్ వారి నూతన గృహానికి వెళ్లి బడిశా నాగరమేష్ కు శుభాకాంక్షలు తెలిపి శాలువాతో సత్కరించారు,
ఈ సందర్బంగా ములుగు జిల్లా పార్టీ అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మణ్ బాబు మాట్లాడుతూ పార్టీ లో విబేధాలు ఉన్నాయి అని కొంతమంది యూట్యూబ్ ఛానల్ ద్వారా అసత్య ప్రచారాలు చేస్తున్నారని అన్నారు, ములుగు జిల్లాలో ఎలాంటి విభేదాలు లేవని అందరం కలిసిగట్టుగా పనిచేస్తున్నామని ములుగు జిల్లా పార్టీ అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మణ్ బాబు అన్నారు, కొంతమంది యూట్యూబ్ ఛానల్ వాళ్లు మరియు ప్రత్యర్థి పార్టీలు నాయకులు కలిసి ఇలాంటి దుష్ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు, ములుగు జిల్లాలలో బీఆర్ఎస్ పార్టీ పటిష్టంగా ఉందని ప్రత్యర్థి పార్టీ నాయకులు కావాలని విభేదాలు సృష్టించాలని ఇలాంటి అసత్య ప్రచారాలు చేస్తున్నారు కావున బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు ఎవరు నమ్మకండి అని అన్నారు, రాబోయే స్థానిక సంస్థలో బీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం ప్రతి ఒక్కరూ గ్రామ గ్రామానికి తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మోసాలని వివరించాలన్నారు,
ఈ కార్యక్రమంలో తోట రమేష్, మండల ప్రధాన కార్యదర్శి గుండేటి రాజుయాదవ్, జిల్లా యూత్ ప్రధాన కార్యదర్శి బడిశా నాగరమేష్ ,జిల్లా నాయకులు యడ్లపల్లి నర్సింహా రావు, పిఎసిఎస్ చైర్మన్ కూనూర్ అశోక్ గౌడ్ , కాకులమర్రి ప్రదీప్ రావు తాటికృష్ణ, తుమ్మ మల్లారెడ్డి, జిల్లా మహిళా నాయకురాలు కొమరం ధనలక్ష్మి ,పార్టీ నాయకులు చిలకమర్రి రాజేందర్,చిట్టీమల్ల సమ్మయ్య, కర్రీ శ్యాంబాబు,, నూతిలకంటి ముకుందం, గాదె శ్రీనివాస్ చారి, పూజారి శ్రీనివాస్ , సిద్ధంశెట్టి లక్ష్మణ్ రావు,దంతానపల్లి నరేందర్, యలవర్తి శ్రీనివాస్,కర్రీ శ్రీను, నిమ్మగడ్డ ప్రవీణ్, రాజమల్ల సుకుమార్, గుండారాపు రమేష్, హుస్సేన్, రాజసాహెబ్, బడిశా నవీన్, రమేష్, కొమరం చంటి,, కుదురుపాక చిట్టిబాబు, తాడూరి రఘు , మండల యూత్ అధ్యక్షులు గుమ్మలా వీరాస్వామి,గ్రామ కమిటీ అధ్యక్షులు అధ్యక్షులు,చదలవాడ సాంబశివరావు,ఎగ్గడి అర్జున్,రూప భద్రయ్య, మునిగెల సాంబులు,రొడ్డ సుదర్శన్,మహిళలు సరిత,కృష్ణవేణి, నాగ, సోషల్ మీడియా వారియర్స్ గుడివాడ శ్రీహరి, మునిగెల నరేష్, కర్రీ రామ్మోహన్, గందం కిషోర్ , కుమ్మరి చంద్రబాబు, జాడి భోజరావు, అంజన్ రావు, ఎండి ముస్తఫా, వావిలాల కిషోర్,తదితరులు పాల్గొన్నారు,