నల్లబెల్లి, నేటి ధాత్రి:
తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల ఫోరం నల్లబెల్లి మండల శాఖ అధ్యక్షునిగా మలిదశ ఉద్యమకారుడు తంగెళ్ల భాస్కర్ , ప్రధాన కార్యదర్శిగా కొయ్యడ కుమారస్వామి, కోశాధికారిగా ఓదెల రవి, అధికార ప్రతినిధిగా పల్లికొండ రవి లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు టఫ్ జిల్లా అధ్యక్షుడు నందగిరి రజనీకాంత్, రాష్ట్ర నాయకులు ఆకుల సాంబరావు పేర్కొన్నారు మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తంగేళ్ల భాస్కర్ మాట్లాడుతు ఉద్యమకారుల హక్కులు నెరవేరేదాకా నిరంతరం కృషి చేస్తానని మండలంలోని తెలంగాణ ఉద్యమకారులను సంఘటితం చేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మేనిఫెస్టోలో ప్రవేశ పెట్టిన విధంగా 250 చదరపు గజాల ఇంటి స్థలం డబుల్ బెడ్ రూమ్ ఇల్లు పెన్షన్ సౌకర్యం లాంటి పథకాలను వర్తింపజేసేదాకా పోరాటాన్ని ఉదృతం చేస్తానని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మలిదశ తెలంగాణ ఉద్యమకారులు అన్నగారిన వర్గాల అధ్యక్షుడు పరికి కోర్నేల్ మాదిగ, తెలంగాణ ఆకలి కేకల ఫోరం వ్యవస్థాపక అధ్యక్షుడు బొట్ల పవన్, గోనెల నరహరి, మామిండ్ల చిన్న ఐలయ్య, కొత్తగట్టు ప్రభాకర్, బొట్ల సారయ్య, పెద్ద బోయిన కొమురయ్య, నానభోయిన పోషాలు తదితరులు పాల్గొన్నారు.