ఘనంగా స్నేహితుల దినోత్సవ వేడుకలు

ఘనంగా స్నేహితుల దినోత్సవ వేడుకలు

నర్సంపేట,నేటిధాత్రి:

నర్సంపేట పాకాల మహిళా బ్యాంకులో స్నేహితుల దినోత్సవం వేడుకలు అధ్యక్షురాలు పెండెం రాజేశ్వరి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఒకరికొకరు ఫ్రెండ్షిప్ బ్యాండ్లు కట్టుకొని స్వీట్లు పంచుకున్నారు. ఈ సందర్భంగా పెండెం రాజేశ్వరి మాట్లాడుతూ ఈ లోకంలో తల్లితండ్రుల తర్వాత స్వచ్ఛమైన ప్రేమను పంచేది స్నేహితులే అని అన్నారు. కష్టసుఖాల్లో తోడుండి మంచి చెడులను ఆలోచింపజేసే స్నేహితులను ప్రతి ఒక్కరు కలిగి ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా బ్యాంక్ కార్యదర్శి ఇమ్మడి పద్మ, డైరెక్టర్ గొర్రె రాధా, గండు శ్రీదేవి, వనజ, మంజుల, మాణిక్యం, స్పందన, కీసర,విజయతోపాటు పలువురు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version