భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి
కేంద్ర ప్రభుత్వం ద్వారా తెలుగు దేశం పార్టీ అధికారం లోకి వచ్చింది. ఉమ్మడి రాష్ట్రం లో చంద్రబాబు తెచ్చిన అనేక ప్రాజెక్టుల ద్వారా హైదరాబాద్ చుట్టుపక్కల అభివృద్ధి జరిగి, ప్రభుత్వానికి ఆదాయం భారీగా పెరిగినా, గత రెండు దశాబ్దాలుగా తెలంగాణ లో నీటి పారుదల ప్రాజెక్టుల తో పాటు ప్రజలకు కావలసిన మౌలిక సదుపాయాలు కల్పించడం లో ఇప్పటి కాంగ్రెస్, అప్పటి టిఆర్ఎస్ ప్రభుత్వాలు వైఫల్యం చెందాయి. తెలుగు దేశం పార్టీ కేంద్ర ప్రభుత్వం లో వాటాదారు కనుక తెలంగాణ లో ఇక అభివృద్ధి జరిగే విధముగా ప్రతి తెలుగు దేశం కార్యకర్త కృషి చేయాలని, అలాగే మెధావులను, కవులు, కళాకారులను, సామాజిక అభివృద్ధి కాముకులను మరియు గతం లో కొన్ని ప్రత్యేక పరిస్థితులలో మన పార్టీ వదిలి వెళ్ళిన వారిని తిరిగి మన పార్టీ లో చేరే విధముగా ప్రయత్నించాలని కోరుతున్నాను.