తెలంగాణ తెచ్చుకున్నదే నీళ్లు నిధులు నియామకాలు కోసం
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ మా కళ్ళ ముందే కర్ణాటకకు నారింజ నీళ్లు ప్రవహిస్తున్నాయి మా జహీరాబాద్ నీళ్లు మేము నిలబెట్టుకోలేని దుస్థితి మా సొంత రాష్ట్రంలో కూడా నారింజ ప్రాజెక్టు పునరుద్ధరణ మరియు నిర్మాణానికి పడని అడుగులు జహీరాబాద్ ప్రాంత ప్రజలు కోసం నారింజకు లోతైన పూడిక తొలగించి, ప్రాజెక్టును పునర్నిర్మిస్తే, జహీరాబాద్‌లో కురిసిన ప్రతి నీటి చుక్క జహీరాబాద్ ప్రాంత వ్యవసాయ రైతన్నలకు సాగునీటి సమస్యలను పరిష్కరిస్తుంది.
తెలంగాణ తెచ్చుకున్నదే మన నీళ్లు మనకు కావాలని, కళ్ళముందే మన జహీరాబాద్ ప్రతి నీటి బొట్టు పక్క రాష్ట్రానికి పారిపోతుంటే దుఃఖం వస్తుంది.మా జహీరాబాద్‌లోని ప్రతి నీటి చుక్క పొరుగు రాష్ట్రానికి పారుతుండటం విచారకరం కనీసం ఇప్పుడైనా, జహీరాబాద్ ప్రాంత ప్రజాప్రతినిధులు, పార్టీలకు అతీతంగా ఐక్యంగా, ఒక ఉద్యమంగా, నారింజ ప్రాజెక్టు పునర్నిర్మాణమై, ద్వారా, జహీరాబాద్ నియోజకవర్గాన్ని సింగూరు ప్రాజెక్టు లాగా నిర్మాణం జరిగి జహీరాబాద్ భూమిని పచ్చని వనంల మారాలని ఇక్కడి ప్రజలు కోరుకుంటున్నారు.