#జిల్లా బ్యాంక్ నోడల్ అధికారి స్రవంతి.
నల్లబెల్లి, నేటి ధాత్రి:
తెలంగాణ దశాబ్ది డిపాజిట్ పథకంలో ప్రతి వ్యక్తి భాగస్వామ్యమై బ్యాంకు సేవలనుసద్వినియోగపరచుకోవాలని జిల్లా కేంద్ర బ్యాంక్ నోడల్ అధికారి స్రవంతి పిలుపునిచ్చారు. మండల కేంద్రంలోని గురువారం జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ బ్రాంచ్ నందు తెలంగాణ దశాబ్ది డిపాజిట్ పథకానికి సంబంధించిన కరపత్రాన్ని బ్యాంకు ఖాతాదారులకు అందించి పలు అంశాలపై అవగాహన కల్పించారు. అనంతరం స్థానిక బ్రాంచ్ మేనేజర్ కె నరేందర్ అధ్యక్షతన ఏర్పాటుచేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశానుసారము తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సహకార కేంద్ర బ్యాంకు లోని దశాబ్ది డిపాజిట్ పథకం పేరుతో నూతన పథకాన్ని ప్రారంభించింది. బ్యాంకులో డిపాజిట్ చేసిన డబ్బులకు అత్యధిక వడ్డీ రేటు 8.10 % తో కాల పరిమితిని బట్టి బ్యాంకు ఖాతాదారునికి చెల్లించబడతాయని ఆమె పేర్కొన్నారు. అత్యధికంగా 5 లక్షల వరకు డిపాజిట్ సౌకర్యం. నెలవారితోపాటు మూడు నెలలకు ఒకసారి వడ్డీ సౌకర్యం కల్పించబడింది అన్నారు. ఈ అవకాశం సెప్టెంబర్ ఒకటి 2024 వరకు ఉంటుందన్నారు. ఈ అవకాశాన్ని నల్లబెల్లి మండల ప్రజలతోపాటు డిసిసిబి బ్రాంచ్ పరిధిలోగల మండలాల ప్రజలు సద్వినియోగం పరుచుకోవాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది. ఖాతాదారులు తదితరులు పాల్గొన్నారు..