పున్నెల్‌లో ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ప్రచారం
సుధీర్ గౌడ్ అభ్యర్థిత్వానికి గ్రామంలో జోష్
నేటిధాత్రి ఐనవోలు:
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పున్నెల్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి కత్తి సుధీర్ గౌడ్ తరఫున నిర్వహించిన ప్రచార కార్యక్రమానికి వర్ధన్నపేట ఎమ్మెల్యే, మాజీ ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు శుక్రవారం హాజరయ్యారు.
గ్రామంలో అడుగుపెట్టిన ఎమ్మెల్యే నాగరాజు మహిళలు సంప్రదాయ కోలాటాలతో ఘన స్వాగతం పలకడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అనంతరం ఎమ్మెల్యే సర్పంచ్ అభ్యర్థి కత్తి సుధీర్ గౌడ్ తో కలిసి ఇంటి ఇంటికీ వెళ్లి ప్రజలను కలుసుకున్నారు.
ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ,
పున్నెల్ అభివృద్ధికి సమర్థుడైన యువ నాయకుడు సుధీర్ గౌడ్ అవసరం. గ్రామం ఎదుర్కొంటున్న సమస్యలను అర్థం చేసుకుని పరిష్కరించే తీరు సుధీర్‌లో ఉంది. అభివృద్ధి కోసం కాంగ్రెస్ అభ్యర్థులను విజయం సాధించాలని” ప్రజలకు పిలుపునిచ్చారు.
ప్రచారంలో సుధీర్ గౌడ్ యొక్క గ్రామాభివృద్ధి విధానాలు, నీటి సదుపాయాలు, కాల్వల సమస్యల పరిష్కారం, రోడ్ల అభివృద్ధి, యువతకు అవకాశాల కల్పన వంటి అంశాలను ప్రజలకు వివరించారు.గ్రామస్తులు సుధీర్ గౌడ్ కు విస్తృత స్థాయిలో స్పందించడం ప్రచారానికి ఊపు తెచ్చింది.
