విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని ఏబీవీపీ నిరాహార దీక్ష.
చిట్యాల, నేటి ధాత్రి :
చిట్యాల మండల కేంద్రంలో ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని చేపట్టినటువంటి నిరాహార దీక్షకు బిజెపి మండల ప్రధాన కార్యదర్శి మైదం శ్రీకాంత్* హాజరై విద్యార్థి నాయకులకు దండలు వేసి దీక్ష ప్రారంభించి సంఘీభావం తెలపడం జరిగింది ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు మాట్లాడుతూ చిట్యాల మండల కేంద్రంలోని స్థానికంగా ఉన్నటువంటి జూనియర్ కళాశాల లో విద్యార్థులకు హాస్టల్ వసతి అలాగే కళాశాలలో టాయిలెట్స్ సౌకర్యం కల్పించాలని మరియు పెంచిన బస్సు చార్జీలు తగ్గించాలని ఏదైతే మండల కేంద్రంలోని హై స్కూల్ మరియు కస్తూర్బా గాంధీ విద్యాలయం కు దగ్గర ఉన్నటువంటి వైన్ షాపు బెల్ట్ షాపులను తక్షణమే తొలగించాలని అలాగే నూతన బస్టాండ్ ను ప్రారంభించి ప్రయాణకులకు విద్యార్థులకు రవాణా సౌకర్యం మెరుగ్గా ఉండేలా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం మరియు స్థానిక శాసనసభ్యులు ఎమ్మెల్యే మరియు జిల్లా కలెక్టర్ జిల్లా యంత్రాంగం పూర్తిగా స్పందించి ఈ యొక్క సమస్యలను తక్షణమే పరిష్కరించాలని బిజెపి మండల పార్టీ ఆధ్వర్యంలో మేం డిమాండ్ చేస్తున్నాం లేనియెడల ఈ యొక్క కార్యక్రమాన్ని రానున్న రోజులలో మరింత ఉదృతం చేస్తామని హెచ్చరిస్తున్నాం ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా మండల నాయకులు గుండా సురేష్ రాయిని శ్రీనివాస్ వల్లాల ప్రవీణ్ ఓదెల శ్రీహరి చింతల రాజేందర్ కింసారపు ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
