నర్సంపేట ప్రెస్ క్లబ్ లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు
నర్సంపేట,నేటిధాత్రి:
నర్సంపేట పట్టణంలోని డివిజన్ ప్రెస్ క్లబ్ లో భారత 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను జర్నలిస్టుల ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. సీనియర్ పాత్రికేయులు ఉగ్గిడి శివుడు కొబ్బరికాయ కొట్టి వేడుకలను ప్రారంభించగా, గత ప్రెస్ క్లబ్ అధ్యక్షులు, సీనియర్ పాత్రికేయులు కామగోని శ్రీనివాస్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. జర్నలిస్టుల హక్కుల సాధన, సమస్యల పరిష్కారం కోసం ఐక్యంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు కారుపోతుల విజయ్ కుమార్,దీకొండ తిరుమల, పొన్నగంటి స్వామి, సత్య కుమార్, వడ్లకొండ పవిత్రన్,గట్ల అమర్,పిట్టల కుమారస్వామి, బుర్ర వేణు గౌడ్, మహాదేవుని జగదీష్, వడ్లకొండ రాజ్ కుమార్, ప్రశాంత్, శోభన్ , సిద్దు ఆకారపు స్వామి, శోభన్, కార్తీక్, నరేష్,కామిశెట్టి రంజిత్, ముత్తోజు కిరణ్, రమేష్,ఆకారపు మోహన్,గాదం రవి,మైలగాని సందేశ్, మహమ్మద్ ఇబ్రహీం, జట్టబోయిన సాంబమూర్తి, పోశాల రాంబాబు, జూలూరి నరేష్, జనగాం ప్రవీణ్, ఈదుల కృష్ణ, , బుద్ధరత్నం, పెండ్యాల రమేష్,ఇమ్రాన్,రానా,సునీల్, పాల్గొన్నారు.
