thalasemiya baditha baludiki vitharana, తలసేమియా బాధిత బాలుడికి వితరణ

తలసేమియా బాధిత బాలుడికి వితరణ వెంకటాపురం మండలకేంద్రానికి చెందిన కోగిల్ల రాజేష్‌ అనే బాలుడు కొద్దికాలంగా తలసేమియా వ్యాధితో బాధ పడుతున్నాడు. నిరుపేద కుటుంబానికి చెందిన రాజేష్‌కు వైద్యం అందించడంలో కుటుంబసభ్యులు ఇబ్బందిపడుతున్నారు. సమాచారం తెలుసుకున్న వెంకటాపురానికి చెందిన యువకుడు బిల్లా తరుణ్‌ తనకు హరీష్‌రావు అందజేసిన సొమ్ములో 5వేల రూపాయలు బాధిత బాలుడికి అందించి తన మానవత్వాన్ని చాటుకున్నాడు. ఈ 5వేల రూపాయల నగదును బాధిత రాజేష్‌ తండ్రి రాజుకు అందజేశారు.