భక్తుల సౌకర్యాలపై అదనపు కలెక్టర్ ఎన్. రవి పరిశీలన
నేటి ధాత్రి అయినవోలు :-
ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానంలో 2026 సంవత్సరం జాతర ఏర్పాట్లను భక్తుల సౌకర్యార్థం అదనపు కలెక్టర్ ఎన్. రవి పరిశీలించారు. దేవాలయ ఆవరణలో చేపట్టాల్సిన వివిధ పనులను పరిశీలించి, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు సకాలంలో పూర్తిచేయాలని అధికారులకు సూచనలు చేశారు.ఈ కార్యక్రమంలో తహసిల్దార్ విక్రమ్ కుమార్, ఎంపీడీవో నర్మద, ఎస్.ఐ. శ్రీనివాస్, గ్రామ కార్యదర్శి కిషోర్, దేవాలయ చైర్మన్ కమ్మగోని ప్రభాకర్, సిబ్బంది కిరణ్ కుమార్ పాల్గొన్నారు. జాతరకు వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు సమన్వయంతో పనిచేయాలని అదనపు కలెక్టర్ సూచించినట్లు దేవాలయ కార్యనిర్వహణాధికారి కందుల సుధాకర్ తెలిపారు.
